వరల్డ్‌కప్ ప్లాష్‌బ్యాక్: ఇంగ్లాండ్ ఓటమికి కారణమైన బాయ్‌కాట్ ఇన్నింగ్స్!

హైదరాబాద్: ప్రస్తుత మోడ్రన్ డే క్రికెట్‌లో ఛేజింగ్ ఆనేది ఒక ఆర్ట్. భారీ లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదించిన మ్యాచ్‌లను ఎన్నో చూశాం. కానీ, క్రికెట్ తొలినాళ్లలో ఛేజింగ్ అంత ఈజీ కాదు. 1979లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఛేజింగ్ విఫలం కారణంగా ఇంగ్లాండ్ ఓడిపోయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు వెస్టిండిస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 1979 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన వెస్టిండిస్ నిర్ణీత 60 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. విండిస్ బ్యాట్స్‌మెన్లలో వివ్ రిచర్డ్స్ 138 నాటౌట్, కొల్లిస్ కింగ్ 86 పరుగులు చేశారు.

లక్ష్య ఛేదనలో
అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు బ్రేయర్లీ, జెఫ్ బాయ్‌కాట్ నిలకడగా ఆడుతూ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ముఖ్యంగా విండిస్ పేసర్లు ఆండీ రాబర్ట్స్, మైకేల్ హోల్డింగ్, కోలిన్ క్రాఫ్ట్, జోయల్ గార్డెనర్‌లను లక్ష్యంగా చేసుకుని పరుగుల వరద పారించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 129 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ మైక్ బ్రేయర్లీ(64) పరుగుల వద్ద మైకెల్ హోల్డింగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ కింగ్‌కు పెవిలియన్‌కు చేరాడు.

టీ విరామం అనంతరం
టీ విరామం అనంతరం బాయ్‌కాట్ నిలకడగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా పరుగులు రాబడుతున్నాడు. అయితే, రిచర్డ్స్ బౌలింగ్‌లో బాయ్‌కాట్ ఇచ్చిన క్యాచ్‌ని విండిస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ జారవిడిచాడు. ఈ సమయంలో ఇంగ్లాండ్ 25 ఓవర్లకు గాను వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. అయితే, బాయ్‌కాట్ క్యాచ్‌ని క్లైవ్ లాయిడ్ జారవిడచడం పట్ల జట్టులోని ఆటగాళ్లు అసంతృప్తికి గురయ్యారు.

135 పరుగుల వద్ద
ఆ తర్వాత జట్టు స్కోరు 135 పరుగుల వద్ద జెప్ బాయ్ కాట్ (57) మైకేల్ హోల్డింగ్ బౌలింగ్‌లో కాలీచరణ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మ్యాచ్ అనంతరం బాయ్‌కాట్ క్యాచ్‌ని ఎందుకు జారవిడిచావని రిచర్డ్స్ విండిస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్‌ను ప్రశ్నించగా కావాలనే తాను అలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. లక్ష్య ఛేదనలో బాయ్‌కాట్ నిలకడగా ఆడుతుండటంతో ఛేదించాల్సిన లక్ష్యం పెరగడంతో పాటు బంతులు తగ్గడం... దీంతో అతడే ఇంగ్లాండ్ జట్టుని ఓటమి వైపు తీసుకెళ్తున్నాడని తాను భావించినట్లు తెలిపాడు.

ఇది చెడు వ్యూహం
అయితే, ఇది చెడు వ్యూహమని మ్యాచ్ అనంతరం క్లైవ్ లాయిడ్ అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాయ్‌కాట్ 39వ ఓవర్ వరకు ఆడి 105 బంతుల్లో 57 పరుగులు చేశాడు. బాయ్‌కాట్ ఔటైన తర్వాత జట్టు స్కోరు 183 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండు వికెట్లను కోల్పోయింది. అంతేకాదు ఇంగ్లాండ్ తన చివరి 8 వికెట్లను కేవలం 11 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం విశేషం.

92 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓటమి
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 92 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో బాయ్ కాట్ ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్ మీడియా సుసైడికల్ నాక్‌గా అభివర్ణించింది. బాయ్‌కాట్ తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ చేధించాల్సిన లక్ష్యం భారీగా పెరగడంతో దూకుడుగా ఆడే క్రమంలో ఒత్తిడికి గురై తక్కువ పరుగులకే వికెట్లను జేజార్చుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications