ఒకే ఒక్కడు: వరల్డ్‌కప్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు

హైదరాబాద్: హర్ష్‌లే గిబ్స్.... వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్. ఈ రికార్డుని ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మన్ బద్దలు కొట్టలేకపోవడం విశేషం. ఈ అరుదైన రికార్డుకి 2007 వన్డే వరల్డ్‌కప్ వేదికైంది. దక్షిణాఫ్రికాకు చెందిన గిబ్స్ విధ్వంసానికి బలైంది మాత్రం పసికూన నెదర్లాండ్స్.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ఆరంభం కావడంతో ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిబ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులోకి వచ్చిన మొదట్లో నెమ్మదిగా ఆడిన గిబ్స్ నెదర్లాండ్స్ స్పిన్నర్ డాన్ వాన్ బుంగె వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్లో చెలరేగాడు.
వరుసగా 6, 6, 6, 6, 6, 6 సిక్సర్లతో చెలరేగాడు. లాంగాన్‌లో తన తొలి సిక్స్ బాదిన గిబ్స్ ఆ తర్వాత బుంగెకు చుక్కలు చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొదట 3 వికెట్లకు 353 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా.. 221 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications