Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: ఫైనల్ తర్వాత.. మ్యాక్సీకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

వరల్డ్ కప్ గెలవలేదని టీమిండియా ప్లేయర్లు అందరూ చాలా బాధలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ టోర్నీ టాప్ వికెట్ టేకర్‌గా ఉన్న మహమ్మద్ షమీకి మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలుపు కోసం కావలసిన చివరి పరుగులు చేసింది గ్లెన్ మ్యాక్స్‌వెల్. అతను ఆ పరుగులు చేయగానే టీమిండియా ప్లేయర్లు అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. సిరాజ్, రాహుల్ అయితే మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు విరాట్ కోహ్లీ మంచి గిఫ్ట్ ఇచ్చాడు.

World Cup Final INDvsAUS Virat Kohli gives a memorable gift to Maxwell

వీళ్లిద్దరూ కూడా ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆడతారనే సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ కూడా కౌగిలించుకున్న ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మ్యాక్సీని కోహ్లీ అభినందిస్తుంటే.. కోహ్లీని మ్యాక్సీ ఓదారుస్తున్నట్లుగా ఈ ఫొటో ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో కీలకమైన హాఫ్ సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ (54) తన జెర్సీని మ్యాక్స్‌వెల్‌కు బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే కోహ్లీకి చివరి వరల్డ్ కప్ అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తన చివరి వరల్డ్ కప్ ఇన్నింగ్స్ జెర్సీని ఇలా ఇవ్వడం ఫ్యాన్స్‌ను ఎమోషనల్ చేస్తోంది.

ఈ గిఫ్ట్‌ను మ్యాక్స్‌వెల్ ఎప్పటికీ మర్చిపోలేడని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ కూడా కళ్లలో నీళ్లు అదుముకుంటూ కనిపించాడు. అతన్ని భార్య అనుష్క ఓదార్చింది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రాహుల్ ఇద్దరే భారత్ తరఫున హాఫ్ సెంచరీలు చేశారు. రోహిత్ మంచి ఆరంభం ఇచ్చినా.. దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.

ఇక మిగతా బ్యాటర్లు విపలం అవడంతో భారత్ కేవలం 240 పరుగులే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో భారత బౌలర్లు వికెట్లు తీసుకోలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా టీం ఆరు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి, ఆరో సారి వరల్డ్ కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది.

Story first published: Monday, November 20, 2023, 21:35 [IST]
Other articles published on Nov 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+