For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Suresh Raina: అతని కెప్టెన్సీనే తేడా.. అందుకే భారత్ ఓడిపోయింది: సురేష్ రైనా

వరల్డ్ కప్ గెలవలేదని టీమిండియా ప్లేయర్లు అందరూ చాలా బాధలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ టోర్నీ టాప్ వికెట్ టేకర్‌గా ఉన్న మహమ్మద్ షమీకి మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ ఓటమి గురించి టీమిండియా మాజీ స్టార్ సురేష్ రైనా కూడా మాట్లాడాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుతంగా కెప్టెన్సీ చేశాడని మెచ్చుకున్నాడు. 'మ్యాచ్‌ను ఆసీస్ వైపు తిప్పింది కమిన్స్ కెప్టెన్సీనే. రోహిత్‌ను అవుట్ చేయడానికి మ్యాక్స్‌వెల్‌తో బౌలింగ్ వేయించడం చాలా తెలివైన నిర్ణయం. ట్రావిస్ హెడ్ క్యాచ్ కూడా సూపర్ అనే చెప్పాలి' అని రైనా అన్నాడు.

World Cup Final INDvsAUS Suresh Raina credits Pat Cummins for his brilliant captaincy

'అలాగే కోహ్లీని కమిన్స్ అవుట్ చేయడం కూడా అద్భుతమైన నిర్ణయానికి దక్కిన ఫలితమే. ఆసీస్ జట్టు భారత్ కన్నా మెరుగ్గా ఆడింది. అలాగే వాళ్ల ప్లానింగ్ కూడా సూపర్‌గా ఉంది' అని రైనా మెచ్చుకున్నాడు. అంతేకాదు, ఆసీస్ ఫీల్డింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఆసీస్ ఆటగాళ్ల డైవ్‌లు, అద్భుతమైన స్టాప్‌లు సూపర్ అని కితాబిచ్చాడు.

World Cup Final INDvsAUS Suresh Raina credits Pat Cummins for his brilliant captaincy

'సూపర్ ఫీల్డింగ్ వల్ల ఆసీస్ కనీసం 30-40 పరుగులు కట్టడి చేయగలిగింది. మొదటి బంతి నుంచే సింగిల్స్, బౌండరీలు ఆపుతూ వచ్చారు. ట్రావిస్ క్యాచ్ ఒక్కటే కాదు, డీప్‌లో వార్నర్, లబుషేన్ కూడా సూపర్ ఫీల్డింగ్ చేశారు' అని రైనా చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీలో కూడా కమిన్స్ తన టెంపర్‌మెంట్ చూపించాడని మెచ్చుకున్నాడు.

World Cup Final INDvsAUS Suresh Raina credits Pat Cummins for his brilliant captaincy

'ప్రతి భారత బ్యాటర్ మీద ఒత్తిడి పెట్టడంలో కమిన్స్ సక్సెస్ అయ్యాడు. భారత బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా కూడా ఒత్తిడి పెట్టారంటే కమిన్స్ తెలివితేటలే కారణం. అతని వ్యూహాలే ఈ మ్యాచులో రెండు జట్ల మధ్య తేడా. అతని ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ చాలా అద్భుతం' అని రైనా కితాబిచ్చాడు.

Story first published: Wednesday, November 22, 2023, 10:50 [IST]
Other articles published on Nov 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+