వరల్డ్ కప్ గెలవలేదని టీమిండియా ప్లేయర్లు అందరూ చాలా బాధలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ టోర్నీ టాప్ వికెట్ టేకర్‌గా ఉన్న మహమ్మద్ షమీకి మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలుపు కోసం కావలసిన పరుగులు చేయగానే.. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ కన్నీటిని ఆపుకోలేక మైదానంలోనే ఏడ్చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కన్నీటిని బలవంతంగా కన్నీటిని ఆపుకుంటూ మైదానం నుంచి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయాడు.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా కన్నీటిని ఆపుకోలేకపోయాడు. అతన్ని భార్య అనుష్క శర్మ కౌగిలించుకొని ఓదార్చింది. ఈ ఓటమిని జట్టు తట్టుకోలేకపోయిందని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు భారత జట్టు ఎమోషనల్‌గా కదిలిపోయిందన్నాడు. డ్రెస్సింగ్ రూంలో అందరూ చాలా బాధలో ఉన్నారని వెల్లడించాడు.
'రోహిత్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. డ్రెస్సింగ్ రూంలో దాదాపు అందరూ చాలా బాధ పడ్డారు. అక్కడ చాలా ఎమోషన్స్ కనిపించాయి. ఈ కుర్రాళ్లు ఎంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చారో హెడ్ కోచ్‌గా నాకు బాగా తెలుసు. వాళ్లు ఎలాంటి త్యాగాలు చేశారు? ఎంత ఎఫర్ట్ పెట్టారు? నేను చూస్తూనే వచ్చా' అన్నాడు.
'కుర్రాళ్లను అలా చూడటం చాలా కష్టంగా అనిపించింది. ఈ నెల రోజులుగా మేం పడిన కష్టం, పెట్టిన ఎఫర్ట్ , మేం ఆడిన ఆట ఇవన్నీ చూసిన తర్వాత కూడా మేం ఓడిపోవడం చాలా బాధగా అనిపించింది' అని చెప్పుకొచ్చాడు. ఈసారి టీమిండియా కచ్చితంగా ట్రోఫీ నెగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ ఫైనల్‌లో బ్యాటింగ్ విభాగం విఫలం అవడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు.