Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS: ఫైనల్‌కు వర్షం ముప్పు?.. అతన్ని పక్కన పెట్టడం గ్యారంటీనా?

World Cup Final: నెలరోజులపైగా అభిమానులను ఉర్రూతలూగించిన వన్డే వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. కేవలం ఫైనల్ మాత్రమే మిగిలింది. ఆ మ్యాచ్ కూడా ఆదివారం మధ్యాహ్నం జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో అద్భుతంగా రాణించి, సెమీస్‌లో అనంతరం బలమైన ప్రత్యర్థులకు షాకిచ్చిన అవకాశం కనిపిస్తోంది.

నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ నుంచి స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుందని తెలుస్తోంది. ఇక్కడ వన్డేల్లో సాధారణంగా 5 రన్ రేట్‌తో పరుగులు వస్తాయి. అయితే ఇటీవలి కాలంలో, ముఖ్యంగా ఐపీఎల్‌లొ ఇక్కడి పిచ్ వేగంగా కనిపించింది. దీంతో పరుగులు చేయడం కొంత సులభంగా మారింది. ఈ వరల్డ్ కప్ ఫైనల్‌కు కూడా ఇలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్‌నే ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది.

World Cup Final INDvsAUS Pitch and weather report of Narendra Modi stadium

ఈ స్టేడియంలో అత్యధిక స్కోరును సౌతాఫ్రికా చేసింది. 2010లో జరిగిన మ్యాచులో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 362 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక వాతావరణం విషయానికి వస్తే.. అహ్మదాబాద్‌లో ఈ వరల్డ్ కప్ ఫైనల్‌కు వరుణుడు ఏమాత్రం అంతరాయం కలిగించే అవకాశాలు కనిపించడం లేదు. ఆకాశం చాలా క్లియర్‌గా ఉంటుందని, ఉష్ణోగ్రత ఏకంగా 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ మ్యాచులో పెద్దగా ఫామ్‌లో లేని టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టేస్తారని వార్తలు వస్తుయన్నాయి. అతని స్థానంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడిస్తారని తెలుస్తోంది. పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం అందిస్తుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. సిరాజ్‌ను పక్కన పెట్టి అశ్విన్‌ను ఆడించే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

ఆసీస్‌పై అశ్విన్ మెరుగైన రికార్డు ఉండటం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణం అని తెలుస్తోంది. అదే జరిగితే ఈ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ తర్వాత మళ్లీ అశ్విన్ ఆడుతున్న మ్యాచ్ ఇదే అవుతుంది.

Story first published: Sunday, November 19, 2023, 8:27 [IST]
Other articles published on Nov 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+