World Cup Final: ఆస్ట్రేలియా, భారత్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో ఆసీస్ గెలవాలంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ నెట్టింట తెగ పోస్టులు పెట్టారు. టీమిండియా ఓడిపోవాలంటూ ఏడ్చారు. దీనిపై భారత అభిమానులు దీటుగానే బదులిచ్చారు. వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఈ జాబితాలో టీమిండియా మాజీ దిగ్గజయం ఆకాష్ చోప్రా కూడా చేరాడు. ఇలా సోషల్ మీడియాలో భారత్ ఓడిపోవాలంటూ పాకిస్తానీలు చేస్తున్న పోస్టులపై చోప్రా స్పందించాడు. ఆసీస్ గెలుస్తుందని, ఆ టీం ఫ్యాన్స్ కన్నా కూడా పాకిస్తాన్ ఫ్యాన్స్ ఎక్కువగా నమ్ముతున్నారంటూ చురకలేశాడు.

ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై స్పందించిన అతను.. 'ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆ దేశ ప్రజలు కూడా అంత కాన్ఫిడెంట్‌గా లేరు. కానీ మన పొరుగు దేశం వాళ్లు మాత్రం చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. అవునులే.. వాల్లు అక్టోబర్ 14 ఉదయం నుంచి భారత్ ఓడిపోతుందని ఆశ పడుతూనే ఉన్నారు. కానీ అలా జరగలేదు' అని జోకులు పేల్చాడు.
అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియం వేదికగానే భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఆశించిన స్కోరు చేయలేదు. ఆ తర్వాత వరుస పరాజయాలు చవిచూసిన పాకిస్తాన్.. లీగ్ దశను ఐదో స్థానంలో ముగించి ఇంటి దారి పట్టింది. భారత్ మాత్రం ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సెమీస్ చేరింది.
సెమీస్‌లో బలమైన న్యూజిల్యాండ్‌ను ఓడించిన తర్వాత ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు ఆసీస్‌పై గెలిస్తే 12 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ నెగ్గినట్లు అవుతుంది. కోహ్లీ,రోహిత్ వంటి సీనియర్ బ్యాటర్లు ఎలాగైనా ఈ ట్రోఫీ నెగ్గాలని అనుకుంటున్నారు. మరి ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.