వరల్డ్ కప్ గెలవలేదని టీమిండియా ప్లేయర్లు అందరూ చాలా బాధలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ టోర్నీ టాప్ వికెట్ టేకర్‌గా ఉన్న మహమ్మద్ షమీకి మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అనుకున్న స్కోరు చేయలేకపోయింది. ధనాధన్ షాట్లు ఆడిన రోహిత్ శర్మ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి సమయంలో కోహ్లీ, రాహుల్‌పై మరోసారి భారం పడింది.

వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలతోరాణించారు. కానీ రాహుల్ అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయాడు. చివర్లో సూర్యకుమార్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో భారత జట్టు కేవలం 240 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్య ఛేదనలో ఆరంభంలో కొంత తడబడినా కూడా ఆ తర్వాత ఆసీస్ పుంజుకుంది.
ఆ టీం ఓపెనర్ ట్రావిస్ హెడ్ (137) అద్భుత శతకంతో రాణించగా.. మార్నస్ లబుషేన్ కూడా కీలకమైన హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. ఇలా వీళ్లిద్దరూ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో భారత్ ఈ మ్యాచ్ ఓడింది. ఈ ఓటమికి కారణాలపై మాట్లాడిన ఇంగ్లండ్ మాజీ లెజెండ్ నాసిర్ హుస్సేన్.. ఒక కీలకమైన పొరపాటును ఎత్తి చూపాడు.
భారత జట్టు చాలా మంచి జట్టే.. కానీ ఆ టీంలో నలుగురు బౌలర్లు ఏమాత్రం బ్యాటింగ్ చేయలేరని హుస్సేన్ గుర్తుచేశాడు. ఇదే టీమిండియాకు పెద్ద సమస్యగా మారిందన్నాడు. చివర్లో బ్యాటింగ్ చేసే బౌలర్లు లేకపోవడంతో కోహ్లీ, రాహుల్ చాలా నెమ్మదిగా ఆడాల్సి వచ్చిందని వివరించాడు. అయితే భారత్ ఇప్పటికీ మెరుగైన జట్టేనని, కానీ పిచ్ అలా ఉండటం ఆసీస్‌కు కలిసొచ్చిందని చెప్పాడు.
'భారత టీంలో నలుగురు బౌలర్లకు కనీసం బ్యాటింగ్ చేయడం కూడా పెద్దగా రాదు. 8వ స్థానంలో షమీ వస్తాడనే ఆలోచనతో కోహ్లీ, రాహుల్ నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. లేదంటే వాళ్లిద్దరూ కూడా ధాటిగా ఆడేవాళ్లు. అప్పుడు ఆసీస్ ముందు మరింత పెద్ద లక్ష్యం ఉండేది' అని అభిప్రాయపడ్డాడు.