లీగ్ దశలో టాప్‌లో: ప్రపంచకప్ ఛాంపియన్స్‌కు సెమీస్ ట్రబుల్!

హైదరాబాద్: మే31న ఇంగ్లాండ్‌లో ప్రారంభమైన వన్డే వరల్డ్‌కప్ తుది దశకు చేరుకుంది. మొత్తం 46 రోజులు పాటు జరిగిన ఈ ప్రపంచకప్ ఫైనల్లో చివరకు రెండు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. జులై 14న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ ఫైనల్లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్, 2015 ప్రపంచకప్ ఫైనలిస్ట్ న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ 27 ఏళ్ల తర్వాత మళ్లీ పైనల్‌కు చేరగా.... న్యూజిలాండ్ మాత్రం వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ప్రపంచకప్ లీగ దశలో అద్భుత ప్రదర్శన చేసిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. అయితే, టాప్-2లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు నిలిచాయి. అయితే, పైనల్‌కు ఈ రెండు జట్లు అర్హత సాధించలేకపోయాయి.

గత కొన్ని ఎడిషన్లుగా!
గత కొన్ని ఎడిషన్లుగా ఇదే కొనసాగుతుంది. 1999 నుంచి 2007 వరకు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా మళ్లీ ఆ హోదాను దక్కించుకోవడంలో విఫలమైంది. అయితే, 2015 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన పైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించి మళ్లీ ఛాంపియన్‌గా అవతరించింది. అయితే, దానిని 2019లో నిలబెట్టుకోవడంలో విఫలమైంది.

2019 ప్రపంచకప్‌లో ఇలా!
ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన 2019 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఎడ్జిబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, లీగ్ దశలో పాయంట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా వరుసగా రెండోసారి సెమీఫైనల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

1987 ప్రపంచకప్‌లో టీమిండియా
1983 ప్రపంచక్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. అయితే, ఆ తర్వాత 1987 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీపైనల్ మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరికొన్ని జట్లు సైతం రెండోసారి ఛాంపియన్స్‌గా అవతరించడంలో విఫలమయ్యాయి.

పాకిస్థాన్ సైతం ఓటమి
1992 ప్రపంచకప్ ఛాంపియన్ అయిన పాకిస్థాన్ ఆ తర్వాత జరిగిన 1997 ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో ఓడిపోయి క్వార్టర్ ఫైనల్‌లోనే ఇంటిదారి పట్టింది. ఇక, 2007 ఛాంపియన్ ఆస్ట్రేలియా 2011 ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో ఓడిపోయి క్వార్టర్ ఫైనల్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇలా 2007 తర్వాత వరుసగా ఏ జట్టు రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన దాఖలా లేదు.

వరుసగా ప్రపంచకప్ పైనల్స్‌కు
అయితే, కేవలం రెండు జట్లు మాత్రమే వరుసగా ప్రపంచకప్ పైనల్స్‌కు చేరుకుని ట్రోఫీలను గెలిచాయి. ఆస్ట్రేలియా (1996, 1999, 2003 and 2007) ప్రపంచకప్ పైనల్స్‌కు చేరి నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలవగా... వెస్టిండిస్ (1975, 1979 and 1983) ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరినప్పటికీ రెండు సార్లు మాత్రమే ఛాంపియన్‌గా అవతరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications