Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇవాళ HYDలో సిరాజ్ రోడ్ షో..ఎప్పుడు? ఎక్కడంటే?

టీ20 వరల్డ్ కప్ విజేత మహ్మద్ సిరాజ్ ఇవాళ హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. ముంబై మెరైన్‌డ్రైవ్ సీన్‌ను భాగ్యనగరంలోనూ రిపీట్ చేయాలని ఆయన అభిమానులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. వరల్డ్ కప్ గెలిచి ఆలస్యంగా భారత్‌కు చేరిన టీమిండియాకు గురువారం అపూర్వ స్వాగతం లభించిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్‌ సేనకు అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు.

బార్బోడస్ నుంచి ప్రత్యేకం విమానంలో భారత ఆటగాళ్లు మొదట ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఆ తర్వాత ముంబైకు చేరుకున్నారు.విశ్వవిజేతలకు స్వాగతం పలకాలని అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో మెరైన్‌డ్రైవ్ జనసంద్రాన్ని తలపించింది. ఓపెన్ టాప్ బస్సులో కొనసాగిన విజయోత్సవ ర్యాలీ చరిత్రలో నిలిచేలా సాగింది. భారత ఆటగాళ్లు కప్‌ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేశారు.

World Cup Champion Mohammad Siraj s Road Show in Hyderabad Today Complete Details Inside

వేలాది అభిమానుల మధ్య టీమిండియా ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. వాంఖడేలో భారత ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్‌కు బీసీసీఐ సన్మానన కార్యక్రమం నిర్వహించింది. రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ చెక్ అందజేసింది. అయితే భారత విశ్వవిజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించిన హైదరాబాద్ పేసర్ సిరాజ్ తన ఇంటికి రానున్నాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌కు రోడ్ షోతో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి టీమిండియా అభిమానులు సిద్ధమయ్యారు.

దీనికి సంబంధించిన వివరాలను మహ్మద్ సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. జులై 5న సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షో మొదలుకానుంది. మెహిదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో కొనసాగుతుంది. ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీని హైదరాబాద్‌లో రీక్రియేట్ చేయాలని సిరాజ్ అభిమానులు పిలుపునిచ్చారు. టీ20 వరల్డ్ కప్‌లో సిరాజ్ గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే తుదిజట్టులో కొనసాగాడు.

పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ప్రధాన బ్యాటర్లు కూడా తడబడిన ఆ మ్యాచ్‌లో సిరాజ్ అజేయంగా ఏడు పరుగులు సాధించాడు. ఇవి విజయం ఎంతో కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ టోర్నీలో ఫీల్డింగ్‌లోనూ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు.

Story first published: Friday, July 5, 2024, 8:09 [IST]
Other articles published on Jul 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+