Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: వరల్డ్ కప్‌లో నో ఛాన్స్.. తొలిసారి పెదవి విప్పిన చాహల్.. ఏమన్నాడంటే?

వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కచ్చితంగా ఉంటాడని చాలా మంది అనుకున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం చాహల్‌ను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో కూడా అతన్ని ఎంపిక చేయలేదు. అప్పుడే చాలా మంది ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇక ఈ టోర్నీ చివరి లీగ్ మ్యాచులో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అతను వరల్డ్ కప్ ఆడటం కుదరదని తేలడంతో.. అక్షర్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్‌ను ఎంపిక చేయాలని టీం మేనేజ్‌మెంట్ భావించింది. అయినా చాహల్‌కు అవకాశం రాలేదు. అతని కన్నా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ వైపు సెలెక్టర్లు మొగ్గుచూపారు.

World Cup 2023 Yuzvendra Chahal talks about his omission from the team

ఇక వరల్డ్ కప్ టీంలో అశ్విన్ పేరు ఖరారు చేస్తూ తాజాగా బీసీసీఐ ఒక ప్రకటన కూడా చేసింది. ఈ వార్త వచ్చిన సందర్భంగా చాహల్ ఒక ట్వీట్ చేశాడు. అశ్విన్‌కు కంగ్రాట్స్ కూడా చెప్పాడు. కానీ చాహల్‌ విషయంలో బీసీసీఐది చాలా కఠినమైన నిర్ణయం అని పలువురు విమర్శించారు. అంత గొప్ప స్పిన్నర్‌ను ఎలాంటి కారణం లేకుండా పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తాజాగా తన దుదృష్టం గురించి యుజ్వేంద్ర చాహల్ స్పందించాడు. 'ఇది వరల్డ్ కప్ కాబట్టి కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేస్తారనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. ఈ టోర్నీలో మనకు నచ్చినట్లు 17-18 మందిని ఎంపిక చేయడం కుదరదు కదా. కొంచెం బాధ ఉన్న మాట వాస్తవమే' అని చాహల్ అన్నాడు.

'జీవితంలో నా మోటో ఒకటే.. ఇలాంటి పరిస్థితుల నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి. నాకది ఇప్పుడు అలవాటే. మూడు వరల్డ్ కప్‌లు అయ్యాయి కదా' అని నవ్వాడీ స్పిన్నర్. ఇలా జట్టుకు దూరంగా ఉండే సమయంలో కూడా ఫిట్‌గా, గేమ్ రెడీగా ఉండేందుకు కౌంటీ క్రికెట్ ఆడాలని చాహల్ డిసైడ్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ వచ్చి కెంట్ టీంతో చేరాడు.

'ఎక్కడో ఒక చోట, ఎలాగోలా క్రికెట్ ఆడాలనే కోరికతోనే కెంట్‌లో చేరా. ఇక్కడ నాకు టెస్టులు ఆడే అవకాశం వచ్చింది. భారత్‌లో కూడా టెస్టుల్లో ఆడాలనేదే నా ఆశ. కాబట్టి ఇది నాకు మంచి అనుభవమే. కోచ్‌లతో కూడా ఈ విషయం గురించి మాట్లాడా. వాళ్లు కూడా నేను ఇలా ఆడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే నెట్స్‌లో ఎంత ప్రాక్టీస్ చేసినా.. మ్యాచ్ అంటే మ్యాచే' అని చాహల్ అన్నాడు.

అందుకే మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం కెంట్‌కు ఆడుతున్నట్లు చెప్పాడు. ఇక్కడ కౌంటీల్లో ఫస్ట్ డివిజన్‌ వంటి స్థాయిలో ఆడటం తనకు ఎంతో నేర్పిస్తుందన్నాడు. తను ఇక్కడ కూడా ఎంతో నేర్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అతని మాటలు విన్న ఫ్యాన్స్.. చాహల్‌కు మళ్లీ టీమిండియా అవకాశం రావాలని కోరుకుంటున్నారు.

Story first published: Sunday, October 1, 2023, 15:05 [IST]
Other articles published on Oct 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+