Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yuvraj Singh: ధోనీ, నేను బెస్ట్ ఫ్రెండ్స్ కాదు.. కీలక విషయాలు చెప్పిన యువీ!

ఒకప్పుడు టీమిండియా స్టార్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. ధోనీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ రెండూ గెలిచిన టీంలో యువీ చాలా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్ కప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అందుకొని తను ఎంత కీలకమో నిరూపించాడు. ఆ తర్వాత కేన్సర్ కారణంగా యువీ కెరీర్ తడబడింది.

ఇక ఆ తర్వాత యువీ కెరీర్ నాశనం అవ్వడానికి ధోీననే కారణం అంటూ కొందరు విమర్శలు చేశారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో యువీ ఆడాల్సిన స్థానంలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడని, తద్వారా యువీకి దక్కాల్సిన క్రెడిట్ కొట్టేశాడని అనే వాళ్లు కూడా ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నా యువీ ఎప్పుడూ ధోనీ గురించి పెద్దగా మాట్లాడలేదు.

World Cup 2023 Yuvraj Singh says he is not best friends with MS Dhoni

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ధోనీతో తనకున్న అనుబంధం గురించి యువీ వెల్లడించాడు. 'నేను, మహీ అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. క్రికెట్ వల్లనే మేం ఫ్రెండ్స్ అయ్యాం. ఇద్దరం కలిసి ఆడాం. మహీ లైఫ్ స్టైల్, నా లైఫ్ స్టైల్ కంప్లీట్ భిన్నంగా ఉంటాయి. అందుకే మేం అంత గొప్ప ఫ్రెండ్స్ కాలేకపోయాం అనుకుంటా' అని యువీ చెప్పుకొచ్చాడు.

'నేను, మహీ మైదానంలోకి వెళ్లినప్పుడు మాత్రం.. దేశం కోసం వంద శాతం కన్నా ఎక్కువ ఇవ్వడం కోసమే ప్రయత్నించే వాళ్లం. ఆ విషయంలో తను కెప్టెన్, నేను వైస్ కెప్టెన్. టీంలోకి వచ్చే సరికి నేను నాలుగేళ్ల జూనియర్‌ను. కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు సహజమే' అని వివరించాడు.

'ఒక్కోసారి ధోనీ తీసుకునే నిర్ణయం నాకు నచ్చేది కాదు. ఒక్కోసారి నా నిర్ణయం ధోనీకి నచ్చేది కాదు. ప్రతి టీంలో అది జరుగుతూనే ఉంటుంది. నా కెరీర్ చివరి దశలో, ఏం చేయాలో తెలియనప్పుడు నేను కూడా తననే సలహా అడిగా. సెలెక్టర్లు నన్ను పరిగణనలోకి తీసుకోవడం లేదని అందరి కన్నా ముందు నాకు చెప్పింది ధోనీనే' అన్నాడు.

'ఆ మాట కొంచెం బాధాకరమే అయినా కూడా.. కనీసం వాస్తవ చిత్రం ఏంటో నాకు తెలిసింది. ఇది జరిగింది 2019 వరల్డ్ కప్ ముందు. అదే నిజం. దాన్ని నాకు ధోనీ స్పష్టంగా చూపించాడు. మైదానం బయటకు వచ్చేసిన తర్వాత టీంమేట్స్ మన బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాల్సిన అవరం లేదు కదా' అని యువీ వెల్లడించాడు.

Story first published: Sunday, November 5, 2023, 15:13 [IST]
Other articles published on Nov 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+