Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: కేన్ మామా నీ కామెడీ టైమింగే వేరు.. ఇంతలా ఆట పట్టించాలా?

శ్రీలంపై కివీస్ నెగ్గడంతో వరల్డ్ కప్ సెమీస్ చేరే జట్ల విషయంలో దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. గణాంకాల ప్రకారం పాకిస్తాన్ ఇంకా రేసులోనే ఉన్నా కూడా.. ఆ టీం సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌తో జరిగే తమ చివరి లీగ్ మ్యాచు కోసం ఈ రెడీ అవుతోంది.

ఈ క్రమంలో కివీస్, న్యూజిల్యాండ్ మ్యాచులో జరిగిన ఒక ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పించింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో న్యూజిల్యాండ్ బౌలర్లు విజృంభించారు. చాలా వేగంగాా 8 వికెట్ల వరకు తీసుకున్నారు. ఈ క్రమంలో శ్రీలంక వెటరన్ ఏంజెలో మాథ్యూస్.. ఆడేందుకు క్రీజులోకి వచ్చాడు.

World Cup 2023 Williamson jokes with Angelo Mathews over his timed out dismissal

అతను గత మ్యాచులో బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు కివీస్ ప్లేయర్లు అతన్ని ఆటపట్టించారు. అతను క్రీజులోకి వెళ్లే సమయంలో పేసర్ ట్రెంట్ బౌల్ట్ వచ్చి.. అన్నీ సరిగా చెక్ చేసుకున్నావా? అని అడిగాడు. ఆ వెంటనే కేన్ విలియమ్సన్ వచ్చి 'నీ హెల్మెట్ చూసుకున్నావా? స్ట్రాప్ తెగిందా? సరైన హెల్మెట్టే తెచ్చుకున్నావా?' అంటూ ప్రశ్నించాడు.

ఈ మాటలన్నీ విన్న ఏంజెలో మాథ్యూస్ కూడా నవ్వేశాడు. దీనంతటికీ వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. అంతకుముందు మ్యాచులో ఈ శ్రీలంక వెటరన్ బ్యాటర్ అనూహ్యంగా 'టైమ్ అవుట్'గా పెవిలియన్ చేరాడు. అతని హెల్మెట్ స్ట్రాప్ తెగిపోవడంతో మరో హెల్మెట్ అడిగాడు. అదే సమయంలో టైంకు మాథ్యూస్ రెడీగా లేడని బంగ్లాదేశ్ అప్పీల్ చేసింది.

దీంతో అంపైర్లు చేసేదేం లేక అతన్ని అవుట్‌గా ప్రకటించారు. ఇదే విషయాన్ని మాథ్యూస్‌కు గుర్తు చేసిన విలియమ్సన్, బౌల్ట్ ఇద్దరూ పెద్దగా నవ్వేస్తూ కనిపించారు. అన్నీ రెడీగా పెట్టుకున్నానని చెప్పి క్రీజులోకి వెళ్లాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా కివీస్ ప్లేయర్ల కామెడీ టైమింగ్‌ చూసి నవ్వుకుంటున్నారు.

Story first published: Friday, November 10, 2023, 10:02 [IST]
Other articles published on Nov 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+