Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: వార్మప్ మ్యాచులతో టీమిండియా ఫ్యాన్స్‌కు టెన్షన్.. ఆ టీంతో తిప్పలు తప్పేలా లేవుగా!

వరల్డ్ కప్‌లో టీమిండియాకు మరోసారి వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఈ మెగా టోర్నీలో భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారిన టీమ్స్‌లో న్యూజిల్యాండ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌లో కూడా ఈ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. మెగా టోర్నీ ప్రిపరేషన్స్ కోసం భారత్‌కు వచ్చిన కివీస్ జట్టు.. వార్మప్ మ్యాచుల్లో సూపర్ పెర్ఫామెన్స్ ఇస్తోంది.

కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచులో కివీస్ చెలరేగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ భారీ స్కోరు చేసి 345 పరుగుల టార్గెట్‌ను కివీస్ ముందు పెట్టింది. దీన్ని 43 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది. ఆ మ్యాచ్‌లో ముందుగా టెయిలెండర్లను బ్యాటింగ్‌కు పంపినా కివీస్ ఈజీగా గెలవడం గమనార్హం. ఆ టీం స్పిన్నర్ రచిన్ రవీంద్ర ఈ మ్యాచులో 97 పరుగులు చేయడం గమనార్హం.

Team India fans are getting tense watching World Cup Warm-up matches

ఇక ఇప్పుడు సౌతాఫ్రికాతో మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న కివీస్.. మరోసారి తమ బ్యాటింగ్ బలాన్ని ప్రదర్శించింది. రబాడ, ఎన్గిడీ వంటి బౌలర్లు ఉన్నా కూడా సఫారీ టీం వారిని ఏమాత్రం కట్టడి చేయలేకపోయింది. గాయం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా రాణించాడు. అతనితోపాటు మిగతా బ్యాటర్లు కూడా చెలరేగారు.

దీంతో ఈ మ్యాచులో కూడా కివీస్ భారీ స్కోరు చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచులో కివీస్ బ్యాటర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అయితే ఆ టీంలో కేవలం డెవాన్ కాన్వే (78), టామ్ లాథమ్ (52) మాత్రమే హాఫ్ సెంచరీలు చేశారు. మిగతా వాళ్లలో ఎవరూ కనీసం అర్ధశతకం కూడా చేయలేదు.

అయినా సరే ఆ జట్టు ఇంత భారీ స్కోరు చేయడం చూసిన భారత ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడూ సెమీఫైనల్ లేదా వర్చువల్ నాకౌట్ మ్యాచుల్లో భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారే కివీస్.. ఇప్పుడు ఇంత మంచి ఫామ్‌లో ఉండటంతో టీమిండియాకు మళ్లీ టెన్షన్ తప్పదని అంటున్నారు. మరి వరల్డ్ కప్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Story first published: Monday, October 2, 2023, 21:05 [IST]
Other articles published on Oct 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+