ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా అజేయంగా దూసుకుపోతోంది. ఈ వరుస విజయాల్లో టీమిండియా ఆటగాళ్లు అందరూ తమవంతు పాత్ర పోషిస్తూ చెలరేగుతున్నారు. ఇలాంటి సమయంలో నెదర్లాండ్స్‌తో చివరి లీగ్ మ్యాచుకు ముందు భారత ఆటగాళ్లకు కొంత బ్రేక్ లభించింది. దీన్ని టీమిండియా స్టార్లు రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
టీమిండియా మిడిలార్డర్‌కు వెన్నెముకలుగా మారిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ షర్ట్స్ లేకుండా ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో కేఎల్ రాహుల్ కూలింగ్ గ్లాసెస్, క్యాప్‌తో కనిపిస్తున్నాడు. ఈ స్టైలిష్ ప్లేయర్లు ఇద్దరూ కూడా ప్రముఖ ఎనర్జీ డ్రింక్ 'రెడ్ బుల్' తాగుతున్నారు.

ఈ ఫొటో చూసిన ఫ్యాన్న్.. వీళ్లిద్దరూ ఈ రెస్ట్ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని, ఆ తర్వాత నాకౌట్ మ్యాచుల్లో జట్టును గెలిపించే బాధ్యత వీరిపై ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం భారత జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా కూడా.. ఇప్పటికీ టీమిండియా బ్యాటింగ్ విభాగం ఎక్కువగా రోహిత్, కోహ్లీలపైనే ఆధారపడుతోందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
అయితే రాహుల్, శ్రేయాస్ కూడా ఈ వరల్డ్ కప్‌లో చక్కగా రాణించారు. టోర్నీ తొలి మ్యాచులో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోయే పరిస్థితిలో నిలిచింది. అలాంటి సమయంలో కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన కేఎల్ రాహుల్.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ తర్వాత కూడా తనకు అవకాశం వచ్చిన మేర బ్యాటుతో విలువైన పరుగులు జోడిస్తూనే ఉన్నాడు.
ఇక వికెట్ కీపింగ్‌లో చాలా మెరుగైన రాహుల్.. డీఆర్ఎస్ నిర్ణయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ ఈ టోర్నీని అంత గొప్పగా ఆరంభించలేదు. అయితే సరిగ్గా నాకౌట్ మ్యాచులకు ముందు ఫామ్ అందుకున్నాడీ ముంబై కుర్రాడు. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో చెలరేగిన అతను.. సౌతాఫ్రికాపై కూడా సత్తా చాటాడు.
వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన అయ్యర్.. నాకౌట్ మ్యాచుల్లో కూడా టీమిండియాకు కీలకం కానున్నాడు. రాహుల్ కూడా జట్టులో చాలా ముఖ్యమైన ప్లేయరే. వీళ్లిద్దరూ ఈ విశ్రాంతితో మళ్లీ ఫుల్ జోష్‌లో మైదానంలో దిగాలని, ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.