PAKvsAFG: వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి ఓటముల హ్యాట్రిక్ నుంచి తప్పించుకోవాలని పాకిస్తాన్ చూస్తుంటే.. పాకిస్తాన్‌ను తమ స్పిన్ మాయతో ఓడించి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేయాలని ఆఫ్ఘనిస్తాన్ ఉవ్విళ్లూరుతోంది.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను పూర్తిగా స్పిన్‌తో దెబ్బతీయాలనే ప్లాన్‌లో ఉంది ఆఫ్ఘనిస్తాన్. దానికి అనుగుణంగానే జట్టులోకి నాలుగో స్పిన్నర్‌ను కూడా తీసుకుంది. ఇక పాకిస్తాన్ జట్టు మొదటి నుంచి పేస్ బౌలింగ్‌పైనే ఆధారపడి బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా పాక్ పేసర్లే ఆ జట్టుకు కీలకం కానున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో కచ్చితంగా పాకిస్తాన్ పేస్‌కి, ఆఫ్ఘన్ స్పిన్‌కి మధ్య రసవత్తరమైన ఫైట్ జరిగేలా కనిపిస్తోంది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బాబర్ ఆజమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహమ్మద్ నవాజ్‌కు జ్వరంతో బాధపడుతున్నాడని, అతడి స్థానంలో షాదాబ్ ఖాన్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు బాబర్. ఇక ఆఫ్ఘన్ జట్టులో ఫరూకీ స్థానంలో నూర్ అహ్మద్‌ను తీసుకున్నట్లు ఆ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తెలిపాడు.
పాకిస్తాన్ జట్టు:
అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు:
రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్.