Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAKvsAFG: సిగ్గు పడాలి.. పాక్ జట్టుపై మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్!

PAKvsAFG: ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో దారుణంగా ఓడిపోవడంతో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఆ జట్టు మాజీలంతా మూకుమ్మడిగా పాక్ జట్టుపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో పాక్ మాజీ లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ కూడా చేరాడు. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడానికి మించిన అవమానం పాక్ జట్టుకు ఇంకొకటి ఉండదంటూ మండిపడ్డాడు.

చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ సునాయాసంగా టార్గెట్‌ను ఛేదించింది. ఈ క్రమంలోనే పాక్ మాజీ లెజెండ్ వసీం అక్రమ్ పాక్ జట్టు ఆట తీరుపై మండిపడ్డాడు.

World Cup 2023 Wasim akram lambasts pakistan after the shocking defeat against Afghanistan

'ఇది సిగ్గు చేటు. 280 పరుగుల టార్గెట్‌ ఛేదనలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోవడమంటే సాధారణ విషయం కాదు. పిచ్ ఎలా ఉందనేది విషయం కాదు. అసలు ఆ ఫీల్డింగ్‌ ఏంటి..? ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ లెవెల్ ఏంటి..?' అంటూ ఓ టీవీ షోలో పాల్గొన్న అక్రమ్ పాక్ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆటగాళ్లు గత 2 ఏళ్లుగా ఫిట్‌నెస్ టెస్ట్ లేకుండానే కొనసాగుతున్నారని, తాము గత మూడు వారాలుగా ఇదే విషయం చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని అక్రమ్ అన్నాడు. ఫిట్‌నెస్‌ లేని ఆటగాళ్ల పేర్లు కూడా తాను చెప్పగలనని, కానీ ఆ పేర్లు చెబితే వాళ్లు తలదించుకుంటారని అన్నాడు. 'వీళ్లు రోజూ 8 కిలోల మటన్ తింటున్నట్లున్నారు. వాళ్లకి ఫిట్‌నెస్ ఉండాల్సిన అవసరం లేదా..?' అంటూ ఘాటుగా ప్రశ్నించాడు.

అంతేకాకుండా మ్యాచ్‌లో గెలవాలంటే ఫీల్డింగే చాలా ముఖ్యమని, పాక్ జట్టులో కరువైందే ఫీల్డింగ్ అని, దానికి కారణం ఫిట్‌నెస్ లేకపోవడమేనని అక్రమ్ చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘన్ మ్యాచ్‌‌లో పాకిస్తాన్ ఫీల్డింగ్ పరమ చెత్తగా ఉందని, దానివల్లే జట్టు ఓడిందన్నాడు. దేశం కోసం ఆడుతూ డబ్బులు సంపాదించుకుంటున్నప్పుడు దానికి తగ్గట్లు వ్యవహరించాలంటూ అక్రమ్ విమర్శల వర్షం కురిపించాడు.

Story first published: Tuesday, October 24, 2023, 13:06 [IST]
Other articles published on Oct 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+