For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023 : వరల్డ్ కప్ ముందు ఇండియా వార్మప్ మ్యాచులు.. ఎప్పుడంటే?

వన్డే వరల్డ్ కప్ మొదలవడానికి నెలరోజులే సమయం ఉంది. ఈ మెగాటోర్నీకి సిద్ధం అవడం కోసం దాదాపు అన్ని దేశాలు వార్మప్ మ్యాచులు ఆడనున్నాయి. భారత్ కూడా ఈ మెగా టోర్నీ ముందు రెండు వార్మప్ మ్యాచులు ఆడనుంది. మొత్తం పది టీమ్స్ వార్మప్ మ్యాచుల షెద్యూల్‌ను ఐసీసీ తాజాగా ప్రకటించింది.

సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ వార్మప్ మ్యాచులు జరగనున్నాయి. గువాహతి, హైదరాబాద్, తిరువనంతపురం.. ఈ మూడు వేదికల్లో ఈ మ్యాచులు నిర్వహించనున్నారు. గతంలో వరల్డ్ కప్‌లలో జరిగినట్లే ఈ వార్మప్ మ్యాచులు కూడా 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే జరుగుతాయి. అయితే వీటికి వన్డే స్టేటస్ మాత్రం ఉండదు.

World Cup 2023 Warm-Up matches schedule announced

ఈ మ్యాచులు ఆడే జట్లు తమ బృందాల్లోని మొత్తం 15 మందినీ ఆడించే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచులు ముగిసిన ఒక రోజు తర్వాత అంటే అక్టోబర్ 5న వన్డే వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ జట్లు తలపడతాయి. నవంబరు 19 వరకు ఈ మెగాటోర్నీ జరుగుతుందన్న విషయం తెలిసిందే.

వార్మప్ మ్యాచుల షెడ్యూల్..:
సెప్టెంబర్ 29:
గువాహతిలోని వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక
తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
హైదరాబాద్ వేదికగా న్యూజిల్యాండ్ వర్సెస్ పాకిస్తాన్

సెప్టెంబర్ 30:
గువాహతి వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లండ్
తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్

అక్టోబర్ 2:
గువాహతి వేదకిగా ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్
తిరువనంతపురం వేదికగా న్యూజిల్యాండ్ వర్సెస్ సౌతాఫ్రికా

అక్టోబర్ 3:
గువాహతి వేదికగా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక
తిరువనంతపురం వేదికగా ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్
హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా

Story first published: Thursday, August 24, 2023, 10:48 [IST]
Other articles published on Aug 24, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+