Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: బూమ్రాని చూసి నేర్చుకో.. షాహీన్ అఫ్రిదీకి పాక్ లెజెండ్ సలహా!

పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీపై ఆ జట్టు మాజీ ఆల్ రౌండర్ వకార్ యూనిస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. షాహీన్ షా రాణించలేకపోవడానికి కారణం అతడిలో క్రమశిక్షణ లేకపోవడమేనన్నాడు. టీమిండియా టాప్ పేసర్ జస్ప్రీత్ బూమ్రాని చూసి నేర్చుకోవాలని అన్నాడు.

షాహీన్ షా అఫ్రిదీ ఈ మధ్య కాలంలో మునుపటిలా పదునైన బంతులతో బ్యాటర్లను భయపెట్టలేకపోతున్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ తో పాటు ప్రస్తుతం వరల్డ్ కప్ లోనూ షాహీన్ ను బ్యాటర్లు ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే షాహీన్ ను పాక్ మాజీ ఆల్ రౌండర్ వకార్ యూనిస్ తీవ్రంగా విమర్శించాడు.

Legend wants Shaheen Afridi to learn from Jasprit Bumrah

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వకార్ యూనిస్.. ఒకపక్క పాక్ పేసర్ షాహీన్ ను విమర్శిస్తూనే మరోపక్క భారత పేసర్ జస్ప్రీత్ బూమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్ కప్ లో బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ రాణిస్తున్నాడని, కానీ షాహీన్ మాత్రం చెత్త బౌలింగ్ తో వికెట్లు తీయలేకపోతున్నాడన్నాడు.

"షాహీన్ బౌలింగ్ లో క్రమశిక్షణ కూడా లేదు. కేవలం వికెట్లు తీయాలనే ఆలోచనతో మాత్రమే బౌలింగ్ చేస్తున్నాడు. యార్కర్లు వేయడానికి ట్రై చేస్తున్నాడు. పదే పదే ఒకే తరహాలో బౌలింగ్ చేస్తే అది బ్యాటర్లకి అర్థమైపోతుంది. షాహీన్ విషయంలో జరుగుతోందదే" అన్నాడు వకార్.

World Cup 2023 Waqar younis wants Shaheen Afridi to learn from Jasprit Bumrah

ఒకపక్క చెత్త బౌలింగ్ తో ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే షాహీన్ తీయగలిగాడని, మరోపక్క బూమ్రా తన బౌలింగ్ లో చక్కటి వేరియేషన్స్ చూపిస్తూ బ్యాటర్లను వణికిస్తున్నాడని, టోర్నీ టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడని, బూమ్రాని చూసైనా షాహీన్ నేర్చుకోవాలని వకార్ చెప్పుకొచ్చాడు.

ఈ వరల్డ్ కప్‌లోనే కాదు. ఆసియా కప్ నుంచి షాహీర్ ఇలా పేలవ ఫామ్‌లోనే కొనసాగుతున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో అయితే కనీసం ఒక్క వికెట్ తీయడానికి కూడా నానాతంటాలు పడుతున్నాడు. కనీసం నెదర్లాండ్స్‌పై కూడా అతను పెద్దగా ప్రభావం చూపెట్టలేకపోవడం గమనార్హం.

Story first published: Tuesday, October 17, 2023, 20:53 [IST]
Other articles published on Oct 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+