Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: మళ్లీ మనసులు గెలుచుకున్న కోహ్లీ.. బుమ్రా కోసం చేసిన పని వైరల్!

కోహ్లీ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. మైదానంలో ఎప్పుడూ హుషారుగా ఉండే అతను.. అప్పుడప్పుడు తన మంచితనంతో కోట్లాదిమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. అలాంటి ఘటనే ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన మొదటి వరల్డ్ కప్ మ్యాచులో కూడా వెలుగు చూసింది.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించాడు విరాట్ కోహ్లీ. ఆ ఇన్నింగ్స్‌తో దేశంలోని కోట్లాది మంది ఫ్యాన్స్‌ హృదయాలను కూడా గెలుచుకున్నాడు. అయితే ఆ ఇన్నింగ్స్‌‌కంటే ముందే కోహ్లీ చేసిన ఓ పని ఫ్యాన్స్‌ ప్రశంసలు అందుకుంటోంది.

World cup 2023 Virat Kohli wins hearts with kind gesture towards Bumrah

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఉత్కంఠ విజయం దక్కించుకుంది. అయితే తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలోని డీజే.. 'కోహ్లీ.. కోహ్లీ..' అని అరుస్తూ.. ఫ్యాన్స్‌ కూడా విరాట్‌ని చీర్ చేయాలని మైక్‌లో చెప్పాడు.

ఇది విన్న కోహ్లీ వెంటనే వెనక్కి తిరిగి.. చీర్ చేయాల్సింది తనను కాదంటూ పిచ్‌ వైపు చూపించాడు. అక్కడ బౌలింగ్ చేస్తున్న బుమ్రాను చూపిస్తూ అతడిని చీర్ చేయాలంటూ డీజేకి సూచించాడు. ఇది గమనించిన డీజే కూడా 'కోహ్లీ చెబుతున్నాడు.. బుమ్రాని చీర్ చేయండి..' అనడంతో ఫ్యాన్స్ కూడా వెంటనే బుమ్రాను చీర్ చేయడం మొదలుపెట్టారు.

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో విరాట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే కోహ్లీ గొప్ప మనసు చాటుకున్నాడంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే.. ఇంకొంతమంది అందుకే కోహ్లీని కింగ్ అంటారంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇంతకుముందు కూడా విరాట్ ఇదే తరహాలో ఇతర ఆటగాళ్లకు అండగా నిలిచాడు. 2019లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌‌ భారత్‌లో టెస్ట్ సిరీస్ ఆడుతున్నప్పుడు కొందరు ప్రేక్షకులు అతడిని మోసగాడంటూ తిట్టసాగారు. దీంతో స్మిత్‌కు అండగా నిలిచిన కోహ్లీ.. అతడిని చీర్ చేయాలని ఫ్యాన్స్‌కు సూచించాడు.

విరాట్‌కు సంబంధించి ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏది ఏమైనా ఈ సారి కూడా విరాట్ తన మంచి మనసుతో మరోసారి ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నాడనడంలో సందేహం లేదు.

Story first published: Tuesday, October 10, 2023, 21:10 [IST]
Other articles published on Oct 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+