Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: సెంచరీ పూర్తి చేసుకోమంటే భయపడ్డ కోహ్లీ.. కేఎల్ రాహుల్ ఇలా ధైర్యం చెప్పాడట!

Virat Kohli : ఈ ఏడాది ఆరంభం నుంచి మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు వరల్డ్ కప్‌లో మరో సెంచరీ సాధించాడు. గత వరల్డ్ కప్‌లో సెంచరీ మార్క్ అందుకోలేకపోయిన అతను.. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ దురదృష్టవశాత్తూ 85 పరుగుల వద్ద అవుటైపోయాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్‌పై హాఫ్ సెంచరీ చేసే సమయానికే మ్యాచ్ పూర్తయింది.

పాకిస్తాన్‌పై కూడా కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటి సమయంలో బంగ్లాతో మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచులో రోహిత్, గిల్ జోరు చూసిన వాళ్లంతా కోహ్లీకి మళ్లీ సెంచరీ చేసే ఛాన్స్ లేదనే అనుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి మంచి కాన్ఫిడెంట్‌గా కనిపించిన కోహ్లీ.. జోరుగా తన ఇన్నింగ్స్ నిర్మించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (34 నాటౌట్)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు.

World Cup 2023 Virat Kohli was afraid of completing century

ఈ క్రమంలో కోహ్లీ సింగిల్స్ తీయడానికి వస్తుంటే రాహుల్ నిరాకరించాడు. సెంచరీ పూర్తి చేసుకో అని సలహా ఇచ్చాడట. సరిగ్గా భారత్ విజయానికి, కోహ్లీ సెంచరీకి 15 పరుగులు అవసరమైన సమయంలో కోహ్లీ సింగిల్స్ తీయబోయాడు. అయితే రాహుల్ మాత్రం సింగిల్ తీయడానికి ససేమిరా అన్నాడు. దీంతో కోహ్లీ టెన్షన్ పడినట్లు రాహుల్ చెప్పాడు. ఇలా చేస్తే తానేదో వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నానని అంటారని కోహ్లీ అన్నాడట.

'కోహ్లీ సింగిల్ తీద్దామంటే నేను నిరాకరించా. దీంతో తను వచ్చి ఇలా చేస్తే చూడటానికి బాగోదన్నాడు. తానేదో వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నానని ప్రజలు అంటారని చెప్పాడు. అయితే నేను మాత్రం చాలా క్లియర్‌గా చెప్పా. మనం ఈజీగా గెలిచే ప్లేస్‌లో ఉన్నాం. కాబట్టి అవేం ఆలోచించకుండా సెంచరీ పూర్తి చేసుకో అని సలహా ఇచ్చా' అని రాహుల్ వెల్లడించాడు.

ఇక ఆ తర్వాత బౌండరీలు, డబుల్స్‌తో సెంచరీకి చేరువైన కోహ్లీ.. చివర్లో భారీ సిక్సర్‌తో మ్యాచ్ ముగించడంతోపాటు సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇది కోహ్లీ కెరీర్‌లో 48వ వన్డే శతకం. సచిన్ టెండూల్కర్ ఈ ఫార్మాట్‌లో 49 శతకాలు సాధించాడు. కోహ్లీ అతని కన్నా కేవలం ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఈ వరల్డ్ కప్‌లోనే సచిన్ రికార్డు బద్దలయ్యేలా ఉంది.

Story first published: Friday, October 20, 2023, 8:12 [IST]
Other articles published on Oct 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+