Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: ఆశ్రమంలో విరాట్ కోహ్లీ.. ఇక ఇంగ్లండ్‌కు చుక్కలే అంటున్న ఫ్యాన్స్!

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ధర్మశాలలోని చిన్మయ తపోవన ఆశ్రమాన్ని దర్శించాడు. న్యూజిల్యాండ్‌తో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఈ ఆశ్రమానికి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ధర్మశాల వేదికగా న్యూజిల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (95) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నా.. అద్భుత ఇన్నింగ్స్‌తో దాదాపు చివరి వరకు క్రీజులో పాతుకుపోయి జట్టుకు విజయాన్నందించాడు.

 World Cup 2023 Virat kohli visits Chinmaya Tapovan Ashram in Dharamshala

ఇక ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు వారం రోజులు గ్యాప్ ఉండడంతో టీమిండియా ఆటగాళ్లకు కొద్దిరోజుల విరామం దొరికింది. దీంతో ఆటగాళ్లంతా ధర్మశాలలోని అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా ధర్మశాలలోని చిన్మయ తపోవన ఆశ్రమాన్ని సోమవారం సందర్శించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్.. అయితే ఈ సారి ఇంగ్లండ్‌పై కూడా కోహ్లీ అదరగొడతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫామ్ కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో కోహ్లీ, అనుష్క కలిసి హిమాచల్‌లోని నీమ్ కరోలీ బాబాను, ఆ తర్వాత ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకున్నారని, ఆ తర్వాత కోహ్లీ మళ్లీ ఫాంలోకి రావడమే కాకుండా అలవోకగా సెంచరీలు బాదుతున్నాడంటూ చెప్పుకొచ్చారు. అంటే ఏదో ఓ ధార్మిక స్థలాన్ని దర్శించుకున్నప్పుడల్లా కోహ్లీ అదరగొడతాడని, దీన్ని బట్టి చూస్తే ఇంగ్లండ్‌కి కూడా కోహ్లీ తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు.

ఇక ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో 354 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అందులో ఓ సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలున్నాయి. ఆస్ట్రేలియాపై 85, ఆఫ్ఘనిస్తాన్‌పై 55 పరుగులతో రాణించిన కోహ్లీ.. పాకిస్తాన్‌పై 16 పరుగులతో నిరాశపరిచాడు. కానీ బంగ్లాదేశ్‌పై ఏకంగా 103 పరుగులు చేసి సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక తాజాగా న్యూజిల్యాండ్‌పై 95 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు.

ఇదిలా ఉంటే 29వ తేదీన ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో కూడా కచ్చితంగా గెలవాలని భారత్ పట్టుదలగా ఉంది. అయితే భారత జట్టు ఓటమనేదే లేకుండా ముందుకు సాగాలన్నా.. వరల్డ్ కప్ నెగ్గాలన్నా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాల్సిందేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఛేజింగ్‌లో విరాట్‌ను మించిన బ్యాటర్ ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం లేడని కితాబిస్తున్నారు.

Story first published: Tuesday, October 24, 2023, 15:16 [IST]
Other articles published on Oct 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+