వరల్డ్ కప్ ప్లాన్స్‌కు తుది మెరుగులు దిద్దేందుకు అన్ని జట్లకు వార్మప్ మ్యాచులు యూజ్ అవుతున్నాయి. అయితే టీమిండియా ఆడాల్సిన మొదటి వార్మప్ మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో రెండో వార్మప్ మ్యాచ్ మరింత కీలకంగా మారింది. దీని కోసం టీమిండియా అంతా తిరువనంతపురం చేరుకుంది. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం ముంబై వచ్చేశాడు.
పర్సనల్ ఎమర్జెన్సీ వల్ల తాను ముంబై వెళ్లాల్సి ఉందని, ఆ పని ముగియగానే తిరిగి జట్టుతో కలుస్తానని కోహ్లీ కోరాడట. దీనికి టీం మేనేజ్‌మెంట్ సరే అనడంతో అతను ముంబై వెళ్లిపోయాడు. దీంతో అతను నెదర్లాండ్స్‌తో జరిగే వార్మప్ మ్యాచులో ఆడతాడా? లేదా? అని ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. అయితే అతను 90 శాతం ఈ మ్యాచ్ ఆడతాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.

సోమవారం రాత్రి కల్లా తిరువనంతపురం వచ్చేస్తానని కోహ్లీ చెప్పాడు. కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి గర్భవతి అయిందని, అందుకోసమే కోహ్లీ ఇలా ముంబై వచ్చాడని తెలుస్తోంది. కానీ సోమవారం రాత్రికి కోహ్లీ రిటర్న్ అవ్వలేదని సమాచారం. అయితే మ్యాచ్ మొదలయ్యే సమయానికి కోహ్లీ తిరిగొచ్చేస్తాడని, ఈ మ్యాచ్ కూడా ఆడతాడని టీం మేనేజ్‌మెంట్ కాన్ఫిడెంట్‌గా ఉంది.
'కోహ్లీ త్వరగానే రిటర్న్ అయిపోతాడు. వార్మప్ గేమ్‌కు అందుబాటులో కూడా ఉంటాడు' అని టీం మేనేజ్‌మెంట్ వర్గాలు ధీమాగా ఉన్నాయట. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో నెదర్లాండ్స్‌తో భారత్ ఈ వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 5న వరల్డ్ కప్ మొదలవుతుందనే సంగతి తెలిసిందే.
మెగా టోర్నీ ఆరంభ మ్యాచులో గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ తలపడతాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తమ తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతుంది. ఇది చెన్నై వేదికగా జరగనుంది.