Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: అవుటైనందుకు ఫ్రస్ట్రేషన్‌లో కోహ్లీ.. తల బాదుకుంటున్న వీడియో వైరల్!

వరల్డ్ కప్‌లో టీమిండియా మొదటి మ్యాచ్. ఇలాంటి కీలకమైన మ్యాచులో భారత టాపార్డర్ తేలిపోయింది. కేవలం 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్.. ముగ్గురూ కేవలం తమ ఖాతా కూడా తెరవకుండా పెవిలియన్ చేరారు.

ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ టెన్షన్ పెరిగిపోయింది. భారత ఓటమి తప్పదేమో? అని అందరూ టెన్షన్ పడిపోయారు. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జత కలిశారు. అంత కష్టాల్లో జట్టు ఉన్నప్పుడు కూడా చాలా సంయమనం పాటిస్తూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.

World Cup 2023 Virat Kohli seen frustrated after getting out

ఛేదించాల్సిన లక్ష్యం కేవలం 200 మాత్రమే కావడంతో పెద్దగా రిస్కులు తీసుకోకుండా సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌తో కీలకమైన ఇన్నింగ్స్ నిర్మించారు. ఈ క్రమంలోనే కోహ్లీ 85 పరుగులు చేశాడు. అతను కచ్చితంగా సెంచరీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

జోష్ హాజిల్ వుడ్ వేసిన షార్ట్ బాల్‌ను ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి తరలించాలని కోహ్లీ ప్రయత్నించాడు. అయితే సరైన టైమింగ్ మిస్ అవడం, బంతి అతను అనుకున్నంత వేగంగా రాలేదు. దీంతో కోహ్లీ బాదిన షాట్ నేరుగా ఫీల్డర్ లబుషేన్ వద్దకు వెళ్లింది.

దాన్ని అతను సునాయాసంగా పట్టేశాడు. దీంతో కోహ్లీ చాలా నిరాశ కనిపించాడు. డ్రెస్సింగ్ రూం వెళ్లిన తర్వాత కూడా తను అవుటైన విధానంపై చాలా చికాకు పడిపోయాడు. తను ఇలాంటి కీలక సమయంలో అవుటైనందుకు తల బాదుకుంటూ కనిపంచాడు. దీనికి సంబంధంచిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో తను అవుటైన వీడియో రిప్లేను చూసిన కోహ్లీ.. బల్లపై కూర్చొని తల బాదుకున్నాడు. మ్యాచ్ తన చేతుల్తో ముగించలేకపోయినందుకు చాలా నిరాశగా కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా కూడా కోహ్లీ అలాంటి వాడే అంటూ జోకులు పేలుస్తున్నారు.

Story first published: Monday, October 9, 2023, 8:15 [IST]
Other articles published on Oct 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+