Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: కోహ్లీ లేకుండానే వచ్చేసిన టీం.. వార్మప్ మ్యాచ్ ముందు ఇంటికెళ్లిన విరాట్!

వరల్డ్ కప్‌ కోసం టీమిండియా ప్రిపరేషన్స్ చివరకు వచ్చేశాయి. ఒక బలమైన లైనప్‌ను రెడీ చేసుకున్న టీం మేనేజ్‌మెంట్ ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ గెలవాలనే కసితో ముందుకు వెళ్తోంది. దీనికోసం జట్టు కూర్పుకు తుది మెరుగులు దిద్దాలని అనుకుంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ వార్మప్ మ్యాచుల్లో తమ టీంను బలాన్ని పరీక్షించాలని భావించింది.

అయితే టీమిండియా ఆడాల్సిన తొలి వార్మప్ మ్యాచ్.. వర్షం వల్ల రద్దయింది. దీంతో రెండో వార్మప్ మ్యాచుపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు తిరువనంతపురం బయలుదేరారు కూడా. కానీ ఇక్కడకు చేరుకున్న తర్వాత ఫ్యాన్స్‌కు ఒక డిసప్పాయింట్ న్యూస్ తెలిసింది.

Team India arrived to Thiruvananthapuram for Warm-game

తమ అభిమాన క్రికెటర్లను వరల్డ్ కప్ ముందు మైదానంలో చూస్తే వాళ్ల ఫామ్‌‌పై ఒక అంచనా వస్తుందని అంతా అనుకున్నారు. అయితే సరిగ్గా ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ముంబై వచ్చేశాడు. వ్యక్తిగత ఎమర్జెన్సీతోనే అతను ఇలా ఇంటికి వచ్చేసినట్లు తెలుస్తోంది.

దీంతో కోహ్లీ మినహా మిగతా టీం అంతా తిరువనంతపురం చేరుకుంది. వ్యక్తిగత కారణాలతో ఇలా ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని, తనకు అనుమతి ఇవ్వాలని టీం మేనేజ్‌మెంట్‌ను కోహ్లీ కోరాడట. ఆ తర్వాత మళ్లీ టీం ప్రాక్టీస్‌లో కలుస్తానని కోహ్లీ చెప్పాడట. ఈ పర్మిషన్ దొరకగానే తను ముంబై వచ్చేశాడు.

అంటే మంగళవారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగే వార్మప్ మ్యాచులో కోహ్లీ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ముంబైలో తన పని అయిన వెంటనే సోమవారం నాడే కోహ్లీ మళ్లీ తిరువనంతపురం వెళ్లిపోతాడని, సోమవారం నాడు టీంతో కలుస్తాడని తెలుస్తోంది. అదే జరిగితే కోహ్లీ ఈ మ్యాచులో ఆడే ఛాన్స్ ఉంది. కాగా, మిగతా టీంకు తిరువనంతపురంలో భారత జట్టుకు సంప్రదాయ బద్ధమైన స్వాగతం లభించింది.

Story first published: Monday, October 2, 2023, 21:41 [IST]
Other articles published on Oct 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+