Virat Kohli: ఈ మూడు సచిన్ రికార్డులపై కోహ్లీ కన్ను.. సెమీస్‌లోనే బద్దలు కొట్టేస్తాడా?
World Cup 2023: ఈ వరల్డ్ కప్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన 9 మ్యాచుల్లో కోహ్లీ ఏడింట రాణించాడు. వీటిలో రెండు సెంచరీలు ఉండగా.. ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చివరగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో కూడా కోహ్లీ అర్ధశతకంతో రాణించాడు.
ప్రస్తుతం వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న కోహ్లీ.. సెమీఫైనల్‌లో రాణించడం ద్వారా మూడు సచిన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. గత వారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో సెంచరీ బాదిన కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సచిన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. వీళ్లిద్దరూ 49 వన్డే సెంచరీలు చేసి ఉన్నారు. ఈ మ్యాచులో మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు.

ఇక ఈ వరల్డ్ కప్‌లో 594 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్న అతను.. మరో సచిన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకు వరల్డ్ కప్‌లలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ ఉన్నాడు. 2003లో సచిన్ 673 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 594 పరుగులతో ఉన్నాడు. అతను కనుక కివీస్‌పై మరోసారి రాణిస్తే ఈ రికార్డును కూడా బద్దలు కొట్టడం ఖాయమనే చెప్పాలి.
ఇక ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్‌లో ఏడుసార్లు 50+ స్కోరు చేసిన కోహ్లీ.. ఇలా వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్, షకీబల్ హసన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఈ ముగ్గురూ కూడా ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో ఏడుసార్లు 50+ స్కోర్లు చేశారు. కివీస్‌పై కనుక కోహ్లీ మరో హాఫ్ సెంచరీ సాధిస్తే మిగతా ఇద్దర్నీ వెనక్కు నెట్టి ఒక ఎడిషన్‌లో 8 సార్లు 50+ స్కోరు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలుస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications