Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: అతన్ని ఎదుర్కోవడం పెద్ద టాస్కే.. కానీ ఏం చేయాలో నాకు తెలుసు: విరాట్ కోహ్లీ

భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ అంటే చాలు అందరికీ కోహ్లీ, షకిబ్ ఫైటే గుర్తుకొస్తుంది. షకిబ్ తన స్పిన్ మాయతో కోహ్లీని ఔట్ చేయడానికి ట్రై చేస్తుంటే.. కోహ్లీ తన బ్యాటింగ్ స్కిల్స్ అన్నీ ఉపయోగించి షకిబ్ బౌలింగ్ ని ధాటిగా ఎదుర్కొంటుంటే.. ఆ మజానే వేరు. సరిగ్గా అలాంటి పోరే ఇప్పుడు వరల్డ్ కప్ లో జరగబోతోంది.

పుణె వేదికగా జరగబోతున్న వరల్డ్ కప్ 17వ మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో అంతా కోహ్లీ, షకిబ్ ఫైట్ గురించే మాట్లాడుకుంటున్నారు. వన్డేల్లో వన్డేల్లో వీళ్లిద్దరి ఫైట్ చాలా ఆసక్తిగా ఉంటుంది. వీళ్ళ గణాంకాలు కూడా అలానే ఉంటాయి.

World Cup 2023 Virat Kohli admits facing Shakib Al Hasan is a tough task

ఇప్పటివరకు షకిబ్ బౌలింగ్ లో 148 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. అందులో 140 పరుగులు చేశాడు. అలాగే షకిబ్ తన స్పిన్ తో కోహ్లీని 5 సార్లు ఔట్ చేశాడు. ఇద్దరూ సూపర్ ఫామ్ లో ఉండడంతో ఈ మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారనేది అందరిలో టెన్షన్ పెంచుతోంది.

ఇక షకిబ్ తో ఫైట్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కోహ్లీ.. షకిబ్ ని గొప్ప బౌలర్‌గా వర్ణించాడు. ప్రపంచంలోని మేటి బౌలర్లలో అతడు కూడా ఒకడని, అలాంటి బౌలర్ ను ఎదుర్కొనేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ తో ఉండాలని అన్నాడు. లేదంటే ఎలాంటి బ్యాటర్ అయినా తడబడక తప్పదన్నాడు.

"షకిబ్ చాలా అనుభవజ్ఞుడైన బౌలర్. ముఖ్యంగా కొత్త బంతితో షకిబ్ మాయ చేయగలడు. అతాడిలాంటి బౌలర్లు పరుగులు చేయనివ్వకపోగా.. బ్యాటర్ ని క్రీజ్ లో ముప్పు తిప్పలు పెడతారు. అదే వాళ్ళ స్పెషాలిటీ. అతడిని ఎదుర్కొనేటప్పుడు మన బెస్ట్ ఇవ్వాలి. లేకపోతే మనల్ని ఒత్తిడిలోకి నెట్టి వికెట్ పట్టేస్తారు" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

అలాగే బంగ్లాదేశ్ చిన్న టీమ్ కాదన్న కోహ్లీ.. వరల్డ్ కప్ లో పెద్ద టీమ్, చిన్న టీమ్ అనేవి ఉండవని, చిన్న టీమ్ అనే ఆలోచనతో బరిలోకి దిగితే ఊహించని షాక్ లు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు.

Story first published: Thursday, October 19, 2023, 9:59 [IST]
Other articles published on Oct 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+