Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: చార్మినార్ చేరుకున్న వరల్డ్ కప్ ట్రోఫీ.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

వరల్డ్ కప్ సమరానికి రోజులు దగ్గర పడ్డాయి. ప్రపంచంలో బెస్ట్ క్రికెట్ టీం ఏదో తేల్చుకునేందుకు అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచం అంతా తిరిగొచ్చిన వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ.. హైదరాబాద్ చేరుకుంది. కొన్ని రోజుల క్రితమే భారత్‌కు తిరిగొచ్చిన ట్రోఫీ.. ముందుగా చెన్నై వెళ్లిన సంగతి తెలిసిందే.

అక్కడ ఈ ట్రోఫీని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అక్కడి నుంచి ఈ ట్రోఫీ హైదరాబాద్ వచ్చింది. ఇక్కడి ప్రముఖ కట్టడం చార్మినార్‌ను కూడా ట్రోఫీ సందర్శించింది. చార్మినార్ ముందు ట్రోఫీ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

 World Cup 2023 trophy reaches Hyderabad

తొలిసారి పూర్తిగా భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతోంది. దీంతో ఈ టోర్నీపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారత్‌లో జరుగుతున్న వరల్డ్ కప్‌లో టీమిండియా అదరగొట్టాలని, ట్రోఫీ ముద్దాడాలని ముచ్చట పడుతున్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కోసం టీమిండియా కొత్త జెర్సీని కూడా తాజాగా ఆవిష్కరించారు.

ఈ సమయంలో విడుదల చేసిన 'తీన్ కా డ్రీమ్' సాంగ్ కూడా ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. వరల్డ్ కప్ థీమ్ సాంగ్ కన్నా కూడా ఈ పాటే బాగుందని అంటున్నారు. ఇక ట్రోఫీ విషయానికొస్తే.. హైదరాబాద్ వచ్చిన ట్రోఫీని వరల్డ్ కప్ మ్యాచులు జరిగే వేదికలన్నింటిలో తిప్పనున్నారు. మొత్తం పది నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచులు మొదలవనున్నాయి. తొలి మ్యాచులో గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ తలపడతాయి. ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగే మ్యాచుతో భారత జట్టు తమ వరల్డ్ కప్ ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. అక్టోబర్ 14న పాకిస్తాన్‌ను భారత్ ఢీకొట్టనుంది.

Story first published: Thursday, September 21, 2023, 18:02 [IST]
Other articles published on Sep 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+