Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ కోసం రిటైర్‌మెంట్ యూ టర్న్.. 2019 వరల్డ్ కప్ హీరో కీలక నిర్ణయం!

క్రికెట్‌లో వరల్డ్ కప్ ఎంత ముఖ్యమైన టోర్నీనో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఆడే ప్రతి జట్టూ ఈ టోర్నీ నెగ్గాలనే ఆశ పడుతుంది. దీని కోసం ఏం చేయడానికైనా వెనుకాడదు. ప్రస్తుతం ఇంగ్లండ్ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఈ టీం.. వన్డే వరల్డ్ కప్‌ కూడా గెలిచేందుకు రెడీ అవుతోంది.

దీని కోసం తమ బలమైన జట్టును రెడీ చేస్తోంది. ఈ క్రమంలోనే వన్డే రిటైర్‌మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్‌ను మళ్లీ ఆడించాలని చూస్తోంది. గత వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. అందుకే అతన్ని రిటైర్‌మెంట్ వెనక్కు తీసుకోవాలని ఇంగ్లండ్ బోర్డు అడుగుతున్నట్లు సమాచారం.

Another star is ready to take retirement U-turn for ODI World Cup

క్రికెట్ క్యాలెండర్ చాలా బిజీగా మారడంతో తాను వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్టోక్స్ గతేడాది ప్రకటించాడు. టెస్టుల్లో ఆ జట్టు పగ్గాలు అందుకొని చక్కగా రాణిస్తున్నాడు. ఇప్పుడు వరల్డ్ కప్‌లో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందుకే రిటైర్‌మెంట్‌ యూటర్న్ తీసుకోవాలని స్టోక్స్‌‌ను అడుగుతోందట.

ఇటీవల యాషెస్ సిరీస్ కోసం మొయీన్ అలీని కూడా ఇలాగే రిటైర్‌మెంట్ నుంచి ఇంగ్లండ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వరల్డ్ కప్ కోసం స్టోక్స్‌ను వెనక్కు తీసుకురావాలని అనుకుంటోంది. దీనికి స్టోక్స్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇంగ్లండ్ 2019 వరల్డ్ కప్ హీరో మళ్లీ వరల్డ్ కప్‌లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇటీవలే ఈ విషయంపై ఇంగ్లండ్ కోచ్‌ను అడగ్గా.. ఈ విషయాన్ని ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు వదిలేశామని, అతనే స్టోక్స్‌తో మాట్లాడతాడని కొన్నిరోజుల క్రితం చెప్పాడు. ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు స్టోక్స్ మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో బౌలింగ్ చేయలేదు. ఆ తర్వాత యాషెస్ సిరీసులో కూడా ఓవరాల్‌గా కేవలం 29 ఓవర్లే బౌలింగ్ చేశాడు.

మరి పూర్తి ఫిట్‌గా లేని స్టోక్స్ ఈ టీంకు ఎంత వరకు యూజ్ అవుతాడనేది చూడాలి. అంతేకాదు తను ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వచ్చే ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాలని స్టోక్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో గాయంతోనే అతను వరల్డ్ కప్ ఆడతాడా? అని కొందరు ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.

Story first published: Tuesday, August 15, 2023, 10:08 [IST]
Other articles published on Aug 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+