ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్‌కు టైం రానే వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ రెండు టీమ్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈ మ్యచులో పలు రికార్డులు బద్దలు కొట్టేందుకు ఆటగాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారు. అవేంటో ఒకసారి లుక్కేద్దామా?
అడుగు దూరంలో గిల్: ఇటీవల డెంగ్యూ బారిన పడిన టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచులో రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. కెప్టెన్ రోహిత్ కూడా గిల్ 99 శాతం ఈ మ్యాచ్ ఆడతాడనే చెప్పాడు. అతను కనుక ఆడితే.. ఈ మ్యాచ్‌లో 83 పరుగులు చేస్తే అరుదైన ఘనత సాధిస్తాడు.

ఇప్పటి వరకు తన కెరీర్‌లో 35 వన్డే ఇన్నింగ్సులు ఆడిన గిల్ 1917 పరుగులు చేసి ఉన్నాడు. అతను కనుక ఈ మ్యాచులో 83 పరుగులు చేస్తే కేవలం 36 ఇన్నింగ్సుల్లోనే 2 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా లెజెండ్ హషీమ్ ఆమ్లా (40) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు.
రిజ్వాన్ కూడా అదే రికార్డు కోసం: పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ కూడా వన్డేల్లో 2 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతను ఈ మైలురాయికి 108 పరుగుల దూరంలో ఉన్నాడు. రిజ్వాన్ కనుక భారత్‌పై 108 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన పాక్ వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టిస్తాడు.

ఓవరాల్‌గా పాకిస్తాన్ తరఫున 28 మంది వికెట్ కీపర్లు ఈ మైలురాయిని చేరుకున్నారు. వీరంతా కూడా మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లే. దీంతో 2 వేల పరుగులు చేయడానికి వీరికి చాలా టైం పట్టింది. ప్రస్తుతం రిజ్వాన్ 61 ఇన్నింగ్సుల్లో 1892 పరుగులతో ఉన్నాడు. మరో 17 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధిస్తే.. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (78)ను రిజ్వాన్ బీట్ చేస్తాడు.
మరో స్థాయిలో విరాట్ కోహ్లీ: టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. కోహ్లీ మరో 93 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 26 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటి వరకు సచిన్, కుమార్ సంగక్కర, పాంటింగ్ మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు. కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరే ఛాన్స్ ఉంది.

అంతేకాదు, కోహ్లీ కనుక పాక్‌పై 121 పరుగులు చేస్తే.. వన్డే వరల్డ్ కప్‌లలో పాక్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కూడా నిలుస్తాడు. మెగాటోర్నీల్లో పాక్‌తో మూడు మ్యాచులు ఆడిన కోహ్లీ 191 పరుగులు చేశాడు. వరల్డ్ కప్‌లలో దాయాదులతో ఐదు మ్యాచులు ఆడిన సచిన్ 313 పరుగులు చేశాడు. దీన్ని కూడా కోహ్లీ దాటేయొచ్చు.