Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కెప్టెన్ అయ్యుంటే.. వరల్డ్ కప్‌కు టీం రెడీగా ఉండేది.. ఇప్పుడు అంత సీన్ లేదట!

ఆసియా కప్‌కు టీమిండియా పూర్తిగా రెడీగా కనిపించడం లేదని పాక్ మాజీ దిగ్గజం రషీద్ లతీఫ్ అన్నాడు. ఈ ఫార్మాట్‌‌లో విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా తీసేవారని, అలా చేయకపోయి ఉంటే భారత జట్టు వరల్డ్ కప్‌కు పర్‌ఫెక్ట్‌గా రెడీ అయి ఉండేదని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా ఫుల్‌గా రెడీ అవ్వలేదన్నాడు.

వరల్డ్ కప్‌ కోసం టీమిండియా ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని, లతీఫ్ అన్నాడు. 'కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే.. ఈ వరల్డ్ కప్ కోసం టీమిండియా నూరు శాతం రెడీగా ఉండేది' అని చెప్పాడు. టీమిండియా మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా ఉందని, దీంతో గాయం నుంచి కోలుకుంటున్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌పై అంచనాలు పెరుగుతాయని చెప్పాడు.

 World Cup 2023 Team India would have been worry free in Virat Kohli captaincy

'భారత టీం మేనేజ్‌మెంట్ చాలా మంది ఆటగాళ్లతో ప్రయోగాలు చేసింది. బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే.. టీమిండియా మిడిలార్డర్ ముఖ్యంగా 4 నుంచి 7వ నెంబర్ వరకు ఒక్క ప్లేయర్‌ను కూడా టీమిండియా కుదురుకోనివ్వలేదు. రకరకాల మార్పుల వల్ల ఎవరూ జట్టులో తమ స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయారు' అని లతీఫ్ అభిప్రాయపడ్డాడు.

యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే.. తాను పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీని పక్కన పెట్టేస్తున్నానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ.. అతన్ని వన్డే కెప్టెన్‌గా తొలగించింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా ప్రకటించింది.

ఇది జరిగిన కొన్ని రోజులకే సౌతాఫ్రికాతో టెస్టు సిరీసు కోసం టీమిండియా వెళ్లింది. ఆ సిరీసులో 2-1 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి అనంతరం టెస్టు కెప్టెన్సీని కూడా కోహ్లీ వదులుకున్నాడు. దీంతో టెస్టు టీం పగ్గాలు కూడా రోహిత్ శర్మకే అందించారు. కానీ ఆ తర్వాత టీమిండియా ఆటతీరులో ఇంటెంట్ తగ్గిందని ఫ్యాన్స్ అంటున్నారు.

Story first published: Thursday, August 17, 2023, 14:24 [IST]
Other articles published on Aug 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+