For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: ఫైనల్ కన్నా ఈ మ్యాచ్ ఇంపార్టెంట్.. గెలిస్తే కప్పు మనదే!

వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు అజేయంగా నిలిచిన టీమిండియా.. నాకౌట్స్‌కు రెడీ అవుతోంది. 2019లో సెమీస్‌లో తమను ఓడించిన న్యూజిల్యాండ్‌నే టీమిండియా ఎదుర్కోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై ఫ్యాన్స్‌లో చాలా హైప్ ఉంది. ఈ మ్యాచులో భారత్ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు.

ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ఫైనల్ కన్నా కూడా ఈ సెమీఫైనల్ మ్యాచే ముఖ్యమని టీమిండియా వెటరన్ దినేష్ కార్తీక్ అన్నాడు. ఈ సెమీస్‌లో కనుక గెలిస్తే.. ఫైనల్‌కు ఎవరొచ్చినా టీమిండియా భయపడబోదని అన్నాడు. 'ఒకవేళ ఇండియా కనుక న్యూజిల్యాండ్‌ను ఓడిస్తే.. చివర్లో ఫైనల్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఎవరొచ్చినా టీమిండియాకు భయం లేదు' అని డీకే అన్నాడు.

World Cup 2023 Team India will win trophy if they win semifinals says DK

'టీమిండియా ముందు ఉన్న అతి పెద్ద అడ్డంకి సెమీఫైనల్ మ్యాచే. ఇది దాటితే ఆ తర్వాత ఎవరొచ్చినా కప్పు భారత్‌దే. ఇదే చాలా కీలకమైన మ్యాచ్.' అని చెప్పాడు. అలాగే ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచులో గెలవాలంటే ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేయాలని చెప్పాడు. 'ఇది చాలా పెద్ద గేమ్. కాబట్టి దీనిలో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయాలి' అని డీకే సూచించాడు.

'ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు చేయాలి. అప్పుడు ఆ స్కోరును డిఫెండ్ చేసుకోవడం టీమిండియాకు సులభం అయిపోతుంది. ఎందుకంటే ఈ టోర్నీలో అత్యంత బలమైన బౌలింగ్ విభాగాల్లో టీమిండియాది ఒకటి.' డీకే వివరించాడు. ముంబై వేదికగా భారత్, కివీస్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఈ టోర్నీలో లీగ్ దశలో కివీస్, భారత్ తలపడిన మ్యాచులో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రచిన్ రవీంద్ర, డారియల్ మిచెల్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పినా కూడా.. మహమ్మద్ షమీ చెలరేగడంతో కివీస్ భారీ స్కోరు చేయలేకపోయింది. లక్ష్యాన్ని టీమిండియా సింపుల్‌గా ఛేజ్ చేసింది.

Story first published: Tuesday, November 14, 2023, 9:07 [IST]
Other articles published on Nov 14, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+