Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: వాట్సాప్‌లో టీమిండియా ఛానెల్.. బుమ్రా, రాహుల్ వీడియోలు వైరల్!

వాట్సాప్‌లో కొత్తగా ఛానెల్స్ ఫీచర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిలో టీమిండియా కూడా చేరింది. భారత్ జట్టు తరఫున ఒక వాట్సాప్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో క్రికెట్ గురించి టీమిండియా స్టార్లు పలు సూచనలు చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీసీసీఐ కొన్ని వీడియోలను తమ ఛానెల్‌లో పంచుకుంది. వీటిలో ఒక దానిలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు.

ఫాస్ట్ బౌలర్లకు బుమ్రా కీలకమైన సలహా ఇచ్చాడు. ఈ వీడియోలో మాట్లాడిన అతను.. తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత మనం ఆడే ఆటను పూర్తిగా ఆస్వాదించాలని, ఎంజాయ్ చేయాలని చెప్పాడు. అదే తను ఇచ్చే సలహా అని, ఇలాంటి మరిన్ని సలహాలు, సూచనల కోసం తమ వాట్సాప్ ఛానెల్‌ను ఫాలో అవ్వాలని అడిగాడు. ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్.. ఇలా తమ స్టార్లు సలహాలిస్తుండటం చూసి ఈ ఛానెల్‌ను ఫాలో అవుతున్నారు.

World Cup 2023

టీమిండియా కోసం తయారు చేసిన ఈ వాట్సాప్ ఛానెల్‌లో జట్టుకు సంబంధించిన అన్ని రకాలా అప్‌డేట్స్ అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. కేఎల్ రాహుల్‌తో తీసిన వీడియోలో ఇదే విషయాన్ని చెప్పారు. ఈ వాట్సాప్ ఛానెల్‌కు అందర్నీ ఆహ్వానించిన రాహుల్.. వరల్డ్ కప్ ఆసాంతం జట్టుకు సంబంధించిన పలు ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ ఈ వాట్సాప్ ఛానెల్‌లో లభిస్తాయని చెప్పుకొచ్చాడు.

భారత క్రికెట్‌పై మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఛానెల్‌ను ఫాలో అవడం మొదలు పెట్టారు. తమ టీం, ఫేవరెట్ ప్లేయర్ల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటే దాన్ని ఎవరైనా ఎందుకు వదులుకుంటారని అడుగుతున్నారు. రోహిత్, కోహ్లీతో కూడా ఇలాంటి సలహాలు, సూచనలు ఇప్పించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి త్వరలోనే వాళ్లు కూడా ఇలాంటి వీడియోలతో మన ముందుకు వస్తారేమో చూడాలి.

Story first published: Tuesday, October 3, 2023, 15:47 [IST]
Other articles published on Oct 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+