Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: టీమిండియా వరల్డ్ కప్ జెర్సీ.. సాంగ్ వింటే గూస్‌బంప్స్ తప్పవు!

క్రికెట్ ప్రపంచం అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్న వరల్డ్ కప్‌ ఆరంభానికి రోజులు దగ్గర పడ్డాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు తమ జట్లను ఇప్పటికే ప్రకటించేశాయి కూడా. బలమైన జట్లతో బరిలో దిగుతూ ఎలాగైనా కప్పు కొట్టాలని గట్టిగా పోటీ పడుతున్నాయీ దేశాలు. ఈ క్రమంలో కొత్త జెర్సీలను కూడా విడుదల చేస్తున్నాయి.

ఇప్పుడు భారత్ కూడా తమ కొత్త జెర్సీని విడుదల చేసింది. ఆదిదాస్ కంపెనీతో చేతులు కలిపిన తర్వాత భారత జట్టు పాల్గొంటున్న అతిపెద్ద టోర్నీల్లో ఇదొకటి. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఆదిదాస్ కంపెనీ జెర్సీతోనే టీమిండియా బరిలో దిగింది. ఈ క్రమంలో వచ్చే నెలలో మొదలయ్యే వరల్డ్ కప్‌లో టీమిండియా ధరించే కొత్త జెర్సీని ఆదిదాస్ విడుదల చేసింది.

World Cup 2023 Team India new jersey

సోషల్ మీడియాలో ప్రముఖ సింగర్ రాఫ్తార్ పాడిన 'తీన్ కా డ్రీమ్' (మూడో దాని కోసం కల) అనే పాటతో ఈ వీడియోను విడుదల చేసింది ఆదిదాస్. భారత జట్టుకు అందుతున్న అద్భుతమైన మద్దతుకు ఈ పాట అద్దం పడుతోంది. కోట్లాది మంది అభిమానులు మూడోసారి భారత్ వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నారు. దీన్ని ప్రతిబింబించేలా ఈ పాటను తీర్చిదిద్దారు.

ఇంతకుముందు 1983లో కపిల్ దేవ్ సారధ్యంలో తొలిసారి వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు.. మళ్లీ ట్రోఫీ ముద్దాడేందుకు చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. 2011లో ధోనీ కెప్టెన్సీలో ముంబై వేదికగా జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి వరల్డ్ కప్ ముద్దాడింది టీమిండియా. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో మరోసారి ఈ ట్రోఫీని భారత్ నెగ్గాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఈ కొత్త జెర్సీపై ఎడం వైపు అశోక చక్రంపైన రెండు నక్షత్రాలు మాత్రమే ఉండనున్నాయి. మామూలు జెర్సీపై మూడు నక్షత్రాలు ఉంటాయి. ఎందుకంటే భారత్ రెండు వన్డే వరల్డ్ కప్‌లు, ఒక టీ20 వరల్డ్ కప్ నెగ్గిందనడానికి ఇవి నిదర్శనం. అయితే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా నెగ్గిన రెండు వరల్డ్ కప్‌లకు గుర్తుగా కేవలం రెండు నక్షత్రాలే ఉండనున్నాయి.

భుజాలపై త్రివర్ణాలతో ఉన్న ఈ జెర్సీకి, పాట కూడా అదిరేలా సెట్ అయిందని ఫ్యాన్స్ అంటున్నారు. వరల్డ్ కప్ థీమ్ సాంగ్ కన్నా ఈ పాటే బాగుందని చెప్తున్నారు. ఇంకెందుకాలస్యం? మీరు కూడా వినేయండి.

Story first published: Wednesday, September 20, 2023, 17:13 [IST]
Other articles published on Sep 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+