For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: టీమిండియా చేసిన తప్పులు.. అది మాత్రం మాస్టర్ స్ట్రోక్!

వరల్డ్ కప్‌లలో భారత జట్టు 20 ఏళ్ల తర్వాత అరుదైన విజయం సాధించింది. కివీస్‌ను వరల్డ్ కప్ గేమ్‌లో ఓడించింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా రెండు కీలక పొరపాట్లు చేసింది. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక మాస్టర్ స్ట్రోక్‌తో జట్టుకు విజయం అందించాడు. అవేంటంటే..?

చెత్త ఫీల్డింగ్...:ధర్మశాల స్టేడియంలో అవుట్ ఫీల్డ్ అంత గొప్పగా లేదు. ఇసుకగా ఉన్న ఈ అవుట్ ఫీల్డ్‌లో డైవ్‌లు చేయడానికి టీమిండియా ప్లేయర్లు ఆలోచించారు. దీంతో చాలా బౌండరీలు ఆపలేదు. ఇది ఒక విధంగా సరైన నిర్ణయమే. ఎందుకంటే డైవ్‌లు చేసి బుమ్రా వంటి కీలక ప్లేయర్లు గాయపడితే ఆ తర్వాత టోర్నీలో జట్టుకు సమస్యలు వస్తాయి.

 World Cup 2023 Team India mistakes in INDvsNZ game

కానీ ఫీల్డింగ్ విభాగంలో భారత జట్టు చెత్త ప్రదర్శన చేసిందనేది కాదనలేని సత్యం. జడేజా కూడా సునాయాసంగా వచ్చిన క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత బుమ్రా కూడా చేతుల్లోకి వచ్చిన క్యాచ్ నేలపాలు చేశాడు. కివీస్ వంటి బలమైన జట్టుకు ఇలా అవకాశాలు ఇవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదు.

టీం సెలెక్షన్..:హార్దిక్ పాండ్యా గాయపడిన మాట వాస్తవమే. దీంతో అతని స్థానంలో బ్యాటింగ్ కోసం సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకున్నారు. అదే సమయంలో బౌలింగ్ విభాగాన్ని మెరుగు పరిచేందుకు శార్దూల్ ఠాకూర్‌ను పక్కన పెట్టేశారు. అతని స్థానంలో మహమ్మద్ షమీని తీసుకున్నారు.

ఇది జట్టుకు బాగా కలిసొచ్చింది. ఐదు వికెట్లు తీసుకున్న షమీ.. ఆట మొత్తాన్ని మార్చేశాడు. అతను కనుక బంతితో చెలరేగకపోతే కివీస్ కచ్చితంగా భారీ స్కోరు చేసేదే. సూర్య తన సత్తా నిరూపించుకోలేకపోయినా కూడా.. షమీని తీసుకోవడం నిజంగా టీం మేనేజ్‌మెంట్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి.

 World Cup 2023 Team India mistakes in INDvsNZ game

అనవసర షాట్లు..:ఈ మ్యాచులో టీమిండియా బ్యాటర్లు అందరూ తలా ఒక చెయ్యి వేశారని చెప్పొచ్చు. అందరికీ మంచి ఆరంభాలు లభించాయి. కానీ వాళ్లు అవుటైన విధానం మాత్రం చాలా నిరాశ పరిచింది. శ్రేయాస్ అయ్యర్ మరోసారి షార్ట్ బాల్‌కు వికెట్ పారేసుకున్నాడు. గిల్ కూడా ఇలాగే షార్ట్ బాల్‌కు అనవసర షాట్ ఆడి అవుటయ్యాడు.

సూర్యకుమార్ యాదవ్ కూడా తన సత్తా చూపించుకుండానే రనౌట్ అయ్యాడు. ఎగ్రెసివ్‌గా ఆడే క్రమంలో ఇలా అవుటవడాలు కామనే. కానీ తమ పాజిటివ్ మ్యాచప్‌లకు బ్యాటర్లు వికెట్లు పారేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో అయినా వీళ్లు ఇలా జరగకుండా చూసుకుంటే మంచిది.

Story first published: Monday, October 23, 2023, 12:22 [IST]
Other articles published on Oct 23, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+