Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: బంగ్లాపై గెలుపులో టీమిండియా చేసిన రెండు తప్పులు.. రోహిత్ మాస్టర్ స్ట్రోక్ ఇదే!

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచులో టీమిండియా ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. అయితే ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అదే సమయంలో కొన్ని నిర్ణయాలు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. అవేంటంటే..

రోహిత్ చేసిన తప్పు..
ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ చేసిన ఏకైక పొరపాటు జడ్డూ విషయంలోనే. జడ్డూ తన బౌలింగ్‌తో బంగ్లా బ్యాటర్లను ఎలా తిప్పలు పెట్టాడో అందరూ చూశారు. అలాంటి బౌలర్‌ను 18వ ఓవర్ వరకు రోహిత్ బరిలోకి దింపలేదు.

World Cup 2023 Team India made two mistakes in the INDvsBAN game

జడ్డూ కనుక ముందే బంతి అందుకొని ఉంటే.. బంగ్లా ఓపెనర్లు అంత మంచి భాగస్వామ్యం నెలకొల్పేవారే కాదని కొందరు నిపుణుల అభిప్రాయం. ఈ మ్యాచులో బంగ్లా ఓపెనర్లు లిటాన్ దాస్, తంజీద్ హసన్ ఇద్దరూ కూడా ఆ జట్టుకు అదిరే ఆరంభం అందించారు.

వాళ్లిద్దర్నీ జడ్డూ ఇబ్బంది పెట్టేవాడని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. పవర్ ప్లే అవ్వగానే కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగాడు. అతనికి బదులుగా జడ్డూకు బంతి అందించి ఉంటే బాగుండేదని అంటున్నారు.

రోహిత్ సూపర్ కెప్టెన్సీ
ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా బౌలింగ్ విభాగంలో కీలకంగా మారిన ప్లేయర్ హార్దిక్ పాండ్యా. బుమ్రా, సిరాజ్ ఇద్దరికీ అతను మంచి జోడీగా మారాడు. కానీ ఈ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచులో బంతి అందుకున్న తొలి ఓవర్లోనే పాండ్యా గాయపడ్డాడు.

లిటాన్ దాస్ బాదని స్ట్రెయిట్ డెలివరీకి కాలు అడ్డుపెట్టబోవడంతో పాండ్యాకు గాయమైంది. దీంతో అతను మైదానం వీడాడు. ఇలా సడెన్‌గా జరిగితే ఏ టీం అయినా టెన్షన్ పడిపోతుంది. కానీ రోహిత్ మాత్రం తన వద్ద మిగిలి ఉన్న బౌలర్లను చాలా సమర్ధవంతంగా ఉపయోగించుకున్నాడు.

బంగ్లాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. పాండ్యా లేని లోటు కనిపించకుండా చేశాడు. శార్దూల్ ఠాకూర్ తొలి ఓవర్లో భారీగా పరుగులిచ్చినా ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లను కూడా రోహిత్ చక్కగా రొటేట్ చేశాడు. ఇది కచ్చితంగా రోహిత్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి.

బ్యాటర్లు చేసిన తప్పు
లక్ష్య ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. రోహిత్ శర్మ ధనాధన్ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ ఆ తర్వాత అనవసరంగా భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. టీమిండియా టాప్-4లో కేవలం విరాట్ మాత్రమే తనకు దక్కిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచగలిగాడు.

రోహిత్‌తోపాటు గిల్ కూడా రాణించాడు. అతను హాఫ్ సెంచరీ కూడా చేసుకున్నాడు. కానీ ఆ వెంటనే మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడబోయి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా ఇదే బాటలో నడిచి అవుటయ్యాడు. ఒక్క మ్యాచులో ఇలాగైతే ఏమైంది? అనుకోవచ్చు. కానీ వరల్డ్ కప్ నెగ్గాలంటే వాళ్లంతా రాణించడం చాలా ముఖ్యం.

Story first published: Friday, October 20, 2023, 13:32 [IST]
Other articles published on Oct 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+