Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: అతన్ని ఎలా ఎదుర్కొంటారో?.. పేసర్ ఫామ్‌ చూసి టెన్షన్‌లో టీమిండియా ఫ్యాన్స్!

వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అందరూ మాట్లాడుకుంటున్నది భారత్, పాకిస్తాన్ మ్యాచ్ గురించే. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు చెమటలు చిందించాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది ప్రస్తుతం తన సూపర్ ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన అతను.. ఆ తర్వాత ట20 వరల్డ్ కప్‌లో కూడా పెద్దగా రాణించలేదు.

ఆ టోర్నీ ఫైనల్‌లో మోకాలికి తీవ్రమైన గాయం అవడంతో ఆటకు కొంత కాలం దూరమైన అఫ్రిదీ.. పునరాగమనంలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం నాటింగ్‌హామ్‌షైర్ అవుట్‌లాస్‌కు ఆడుతున్న అతను.. అరుదైన రికార్డు సాధించాడు. బర్మింగ్‌హామ్ బేర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే నాలుగు వికెట్లు తీసుకొని చెలరేగాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఘనత సాధించాడు.

Shaheen Shah Afridi

ఈ ఓవర్ తొలి లీగల్ డెలివరీకి అలెక్స్ డేవీస్‌ను అవుట్ చేసిన అఫ్రిదీ.. ఆ తర్వాత క్రిస్ బెంజమిన్, డాన్ మౌస్లీ, ఎడ్ బార్నార్డ్ ముగ్గుర్నీ పెవిలియన్ చేర్చాడు. యూఏఈ వేదికగా 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత ఓపెనర్లను కూడా అతను చాలా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇద్దరూ ఆ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. ఏమాత్రం రాణించలేదు.

సింగిల్ డిజిట్ స్కోర్లకే ఓపెనర్లు ఇద్దర్నీ షహీన్ అఫ్రిదీ పెవిలియన్ చేర్చాడు. అప్పటి నుంచి ఈ పాక్ పేసర్‌కు పాపులారిటీ చాలా పెరిగింది. తన బౌలింగ్‌లో కూడా పదును పెరిగింది. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో పాక్ జట్టుకు అతను చాలా కీలకం కానున్నాడు. అతను కనుక మునుపటి పదును సాధిస్తే.. భారత బ్యాటర్లకు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది.

Story first published: Sunday, July 2, 2023, 12:38 [IST]
Other articles published on Jul 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+