World Cup 2023: ఆ టీమ్ బ్యాటింగ్ వెన్నెముక ఈ తెలుగు కుర్రాడు.. వరల్డ్ కప్‌లో మెరిశాడు!
నెదర్లాండ్స్ క్రికెటర్ తేజ నిడమనూరు గురించే ఇప్పుడు దేశం మొత్తం చర్చ జరుగుతోంది. ఇండియాలో పుట్టి, న్యూజిల్యాండ్‌లో పెరిగిన తేజ అసలు నెదర్లాండ్స్ తరపున క్రికెట్ ఆడడం ఏంటి..? అది కూడా వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ జాతీయ జట్టు తరపున ఆడడం ఏంటి..? అసలు ఎవరీ తేజ నిడమనూరు. ఏంటతని స్టోరీ..!
అనిల్ తేజ నిడమనూరు విజయవాడలో పుట్టాడు. బుడిబుడి అడుగుల వయసులోనే తాతయ్య ఇంటి వరండాలో బ్యాట్ పట్టి క్రికెట్ పాఠాలు నేర్చుకున్న తేజ.. తన జీవితంలో ఎప్పుడూ నెదర్లాండ్స్ తరపున క్రికెట్ ఆడతానని కానీ, అది కూడా ప్రపంచకప్‌లో పాల్గొంటానని కానీ అనుకోలేదు.

అనిల్ తేజకు 6ఏళ్ల వయసులో తల్లి పద్మావతి పల్లెకోనకు న్యూజిల్యాండ్‌లో డాక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. దాంతో తల్లితో కలిసి ఆక్లాండ్ చేరుకున్నాడు అనిల్. అక్కడ తన క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. అనిల్‌కి 16ఏళ్ల వయసున్నప్పుడు తల్లి పద్మావతి ఉద్యోగం వదిలేసి భారత్ చేరుకున్నారు. దీంతో అనిల్ ఒక్కడే ఆక్లాండ్‌లో నివశించేవాడు.
23 ఏళ్ల వయసులో ఆక్లాండ్ ఏసెస్ తరపున లిస్ట్ ఏ డెబ్యూ చేశాడు. ఆ తర్వాత టీ20, వన్డేల్లోనూ అదే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కానీ జట్టులో పర్మినెంట్ ప్లేయర్ మాత్రం కాలేకపోయాడు. అయితే ఎలాగైనా ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే కలతో ఇంగ్లండ్, నెదర్లాండ్స్‌లోని అనేక క్లబ్‌ల తరపున క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. 2019లో తేజకు ఓ జాబ్ ఆఫర్ వచ్చింది. దాంతో అతడు నెదర్లాండ్స్‌కు కానీ, ఐర్లాండ్‌కు కానీ పర్మినెంట్‌గా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నెదర్లాండ్స్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు తేజ.
అక్కడ వారానికి 40 గంటల చొప్పున ఒకపక్క ఉద్యోగం చేస్తూనే, మరోపక్క ఫిట్‌నెస్, క్రికెట్ ప్రాక్టీస్‌పై ఫోకస్ పెట్టేవాడు. అలాగే రకరకాల క్రికెట్ క్లబ్‌ల తరపున క్రికెట్ ఆడుతూ రాణించేవాడు. తేజ ఆటతీరు నచ్చడంతో నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు అతడికి జాతీయ జట్టులో స్థానం కల్పించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్, విండీస్ మధ్య ఓ వన్డే జరిగింది. ఆ మ్యాచ్‌లో జట్టు ఓడినా అనిల్ తేజ (58) మాత్రం అర్థ సెంచరీతో రాణించాడు. అదే ఊపులో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లోనూ తేజ అద్భుతంగా ఆడి విండీస్‌పై ఈ సారి సెంచరీతో అదరగొట్టాడు. ఫైనల్‌గా ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్నాడు.
కాగా.. భారత్ వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు తేజ. తేజ ఆట చూసేందుకే అతడి తల్లి, కుటుంబ సభ్యులంతా నెదర్లాండ్స్ ఆడే ప్రతి మ్యాచ్‌కు వచ్చి అతడిని చీర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 12న ఇండియా, నెందర్లాండ్స్ తలపడబోతున్నాయి. మరి ఆ మ్యాచ్‌లో తేజ ఎలా ఆడతాడో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications