For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Danushka Gunathilaka: స్టార్ క్రికెటర్ పై బ్యాన్ ఎత్తేసిన శ్రీలంక.. వరల్డ్ కప్ జట్టులోకొస్తాడా..?

శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదిగా అత్యాచారం కేసులో నిందితుడిగా ఉండి నిర్దోషిగా విడుదలైన ఆటగాడిపై నిషేధం ఎత్తేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. అంతేకాదు ఇప్పుడు ఆ ఆటగాడిని వరల్డ్ కప్ జట్టులోకి కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆడిన శ్రీలంక జట్టులో దనిష్క గుణతిలక కూడా సభ్యుడు. అయితే ఆ టోర్నీలో నమీబియాతో జరిగిన మ్యాచ్ మాత్రమే గుణతిలక ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా జట్టు నుంచి, మొత్తం టోర్నీనుంచి వైదొలిగాడు. అదే సమయంలో దనిష్క గుణతిలకపై అత్యాచారం కేసు నమోదైంది.

 World Cup 2023 Srilankan cricket board removes ban on Gunatilaka

అప్పటి నుంచి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ జిల్లా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కారణంగానే శ్రీలంక క్రికెట్ బోర్డుఅతడిని జట్టులోంచి తొలగించడమే కాకుండా ఏకంగా నిషేధం విధించింది. అయితే తాజాగా న్యూ సౌత్ వేల్స్ కోర్టు గుణతిలకను నిర్దోషిగా తేల్చింది. అతడిపై మోపబడిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసింది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా గుణతిలకపై నిషేధం తొలగించింది. అలాగే మళ్లీ జట్టు సెలక్షన్స్ లో పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పించింది.

దీనికి సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక ప్యానెల్ విడుదల చేసిన ఈ ప్రకటనలో.. "గుణతిలక నిర్దోషిగా తేలడంతో అతడి క్రికెట్ కెరీర్ ని, అతడి ఆట ద్వారా జాతీయ క్రికెట్ కు కలిగేప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అతడిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం." అని పేర్కొంది.

కాగా.. నిషేదం తొలగించడంతో ఇప్పుడు గుణతిలకకు శ్రీలంక జట్టులో మళ్లీ స్థానం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ లో కూడా గుణతిలకను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయం కారణంగా జట్టుకు దూరమైతే అతడి స్థానంలో గుణతిలకను తీసుకునే ఆలోచనలోశ్రీలంక క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి గుణతిలక ఫామ్ కూడా ఓ కారణంగా కనిపిస్తోంది.

బ్యాన్ కావడానికి ముందు గుణతిలక శ్రీలంక తరపున 8 టెస్టుల, 47 వన్డేలు, 46 టీ20 లు ఆడాడు. అందులోముఖ్యంగా వన్డేల్లో 86.82 స్ట్రైక్ రేట్ తో 2 సెంచరీలు, 11 అర్థ సెంచరీలు బాదాడు. అయితే గుణతిలక కూడా ఓపెనర్కావడమే ఇప్పుడు సమస్యగా మారింది.

ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న జట్టులో పాథుమ్ నిశాంక, కుషాల్ పెరేరా రూపంలో ఓపెనర్లు ఇద్దరూ అద్భుతంగారాణిస్తున్నారు. సమస్యంతా మిడిలార్డర్ లోనే ఉంది. మరి గుణతిలకను జట్టులోకి తీసుకుంటే ఎక్కడ ఆడిస్తారనేదేఇప్పుడు ప్రశ్నగా మారింది. మరి వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి సతమతమవుతున్న శ్రీలంకకు గుణతిలక లాంటిబ్యాటర్ అవసరం మాత్రం కచ్చితంగా ఉంది.

Story first published: Tuesday, October 17, 2023, 15:16 [IST]
Other articles published on Oct 17, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+