Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: గాయాలతో కీ ప్లేయర్లు దూరం.. అయినా గెలుస్తాం: షనక

ప్రపంచకప్‌లో మరో ఆసక్తికరమైన పోరుకు ఢిల్లీ సిద్ధమైంది. సౌత్‌ఆఫ్రికా, శ్రీలంక జట్లు ఈ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్టింగ్ ఎంచుకుంది.

టాస్ తర్వాత శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక మాట్లాడుతూ.. పిచ్ ప్రస్తుతం బౌలింగ్‌ అనుకూలించేలా ఉంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ టైంకి మంచు కూడా ప్రభావం చూపేలా ఉంది. అందుకే బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. సౌత్‌ఆఫ్రికాను తక్కువ స్కోరుకు కట్టడి చేస్తే మాకు గెలుపు సులువవుతుంది.

World Cup 2023 Sri Lanka confident in winning even without key players

కొంతమంది కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతూ టోర్నీకి దూరమవడం మా జట్టుకు ఇబ్బంది కలిగించే అంశమని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న జట్టుతోనే మంచి ప్రదర్శన ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాం. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు మా జట్టు ప్రస్తుతం పటిష్ఠంగానే ఉంది.

ఇక సౌత్‌ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా మట్లాడుతూ.. తాను టాస్‌ను పట్టించుకోవడం లేదన్నాడు. ప్రస్తుతం తమ జట్టు బలంగా ఉందని, వార్మ్ అప్ మ్యాచ్‌లలో కూడా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచామన్నాడు. బ్యాటింగ్‌లో మంచి స్కోరు నెలకొల్పి, ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణిస్తే తప్పకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్ జరుగుతున్న పిచ్ ఎప్పటిలా లేదని, పిచ్‌పై గడ్డి ఎక్కువగా ఉందన్నాడు. పిచ్‌ సీమర్లకు సహకారం అందిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఇక్కడ 230 పైగా స్కోర్ చేస్తే పోరాడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

సౌత్ ఆఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రాసీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రామ్, హెన్‌రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కగీసో రబాడా, లుంగి, ఎన్‌గిడి, మార్గో జాన్సన్, జెరాల్డ్, కోయిట్జీ, కేశవ్ మహారాజ్

శ్రీలంక జట్టు: దాసున్ షనక (కెప్టెన్), పథుమ్ నిసాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమర విక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, దునిత్ వెల్లలాగే, కాసున్ రజిత, దిల్షాన్ మదుషాంక, మథీసా పతిరాన

Story first published: Saturday, October 7, 2023, 14:27 [IST]
Other articles published on Oct 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+