Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ట్యాలెంట్ లేకపోయినా.. లక్కీగా వరల్డ్ కప్ టీంలో ఛాన్స్ కొట్టేశాడు!

వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయాలతో సతమతం అవుతున్న కేఎల్ రాహుల్‌కు వరల్డ్ కప్ టీంలో చోటు దక్కడం మినహా ఈ జట్టులో పెద్దగా షాకులేం లేవు. ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టునే సెలెక్టర్లు ఈ మెగాటోర్నీకి కూడా ఎంపిక చేశారు. దీనిపై పలువురు రకరకాలుగా స్పందించారు. చాలా మంది కేఎల్ రాహుల్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

అలాగే ఈ జట్టులో తిలక్ వర్మకు కూడా చోటు దక్కలేదు. ఈ తెలుగు కుర్రాడు వెస్టిండీస్‌పై టీ20ల్లో అరంగేట్రం చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత ఐర్లాండ్‌పై తడబడినా కూడా.. అతనికి ఆసియా కప్ టీంలో చోటు దక్కింది. దీంతో మిడిలార్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్ కావాలనే కారణంతో అతన్ని వరల్డ్ కప్‌లో కూడా ఎంపిక చేస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

World Cup 2023 SRH former coach slams BCCI for picking Suryakumar Yadav

అదే సమయంలో వన్డే ఫార్మాట్‌లో పరమ చెత్త రికార్డు ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు సెలెక్టర్లు ఓటేశారు. అతన్ని వరల్డ్ కప్ టీంలో కూడా ఎంపిక చేశారు. దీనిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీ మండిపడ్డాడు. వరల్డ్ కప్ టీంలో సూర్యకుమార్ యాదవ్‌కు పనేంటని నిలదీశాడు. వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ గణాంకాలు చూస్తే.. అతన్ని అసలు వన్డే టీంలోకి కూడా ఎవరూ తీసుకోరు.

సంజూ శాంసన్, తిలక్ వర్మ వంటి మిడిలార్డర్ ఆప్షన్స్ ఉండగా.. సూర్యకుమార్‌ను తీసుకోవడం చాలా మందికి అర్థం కాలేదు. టీం మేనేజ్‌మెంట్ తిలక్ వర్మను తీసుకోవాల్సిందని మూడీ అభిప్రాయపడ్డాడు. 'లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ అయిన తిలక్ వర్మ.. అవసరమైతే పార్ట్ టైం స్పిన్ కూడా వేస్తాడు. అలాంటి వాళ్లను వెనక్కు నెట్టి సూర్యకు ఈ టీంలో చోటు దక్కింది. నన్నడిగితే ఇది అతని లక్ అనే చెప్తా' అని మూడీ అన్నాడు.

'తిలక్‌ను తీసుకొని ఉంటే ఇషాన్ కిషన్ విషయంలో ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది. అంటే కిషన్, తిలక్ ఇద్దరూ ఒకేసారి ఆడలేరని కాదు. కానీ ఈ నిర్ణయం వల్ల జట్టులో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దీని గురించి ప్రెస్ కాన్ఫరెన్సుల్లో రోహిత్ చెప్తూ వస్తున్నాడు కదా' అని మూడీ చురకలేశాడు. వన్డేల్లో తిలక్ ఇంకా అరంగేట్రం చేయలేదు. కానీ అతని ఫస్ట్ క్లాస్ గణాంకాలు కూడా బాగానే ఉన్నాయి. దీంతో అతనికి జట్టులో చోటివ్వాల్సిందని నిపుణుల వాదన.

Story first published: Thursday, September 7, 2023, 7:58 [IST]
Other articles published on Sep 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+