SLvsAFG: గాయాలతో సతమతం అవుతున్న శ్రీలంక మరో కీలక పోరుకు రెడీ అయింది. ఇటీవల డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన శ్రీలంక.. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ను కూడా ఓడించేందుకు రెడీ అవుతోంది. అయితే ఇంగ్లండ్‌పై నిప్పులు చెరిగిన లాహిరు కుమార.. గాయంతో ఈ మ్యాచుకు దూరమవడం గమనార్హం.
పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ టాస్ నెగ్గాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్ చివరి మ్యాచులో పాకిస్తాన్‌పై అద్భుతంగా ఛేజ్ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించేలా ఉందని షాహిదీ అన్నాడు.

ఈ కారణంగానే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు. అలాగే తమ జట్టులో ఫజల్హాక్ ఫరూఖీ ఆడుతున్నాడని, అతని కోసం నూర్ అహ్మద్‌ను పక్కన పెట్టామని వెల్లడించాడు. ఇక శ్రీలంక సారధి కుశాల్ మెండిస్ మాట్లాడుతూ.. తాను టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగే తీసుకునే వాడినన్నాడు.
పిచ్ చాలా బాగుందని, ఇక్కడ మంచి స్కోరు సాధిస్తే గెలవొచ్చని చెప్పాడు. తమ టీంలో దుష్మంత చమీర, దిముత్ కరుణ రత్నే ఆడుతున్నారని వెల్లడించాడు. లాహిరు కుమార స్థానంలో చమీర ఆడుతుండగా.. కుశాల్ పెరీరా స్థానంలో టాపార్డర్ బ్యాటర్‌గా కరుణరత్నేను తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఈ పిచ్‌పై అంత గొప్ప స్పిన్ లభించకపోవచ్చని, ఛేజింగ్‌లో మంచు ప్రభావం కూడా ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. అలాగే రెండో ఇన్నింగ్సులో బంతి కూడా చక్కగా బ్యాటు మీదకు వస్తుందని, అద్భుతంగా బ్యాటింగ్ చేయొచ్చని అంటున్నారు. మరి ఈ రెండు జట్లు భారీ స్కోర్లు చేస్తాయేమో చూడాలి.