Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: బంతి పట్టుకోబోయి.. బొక్కబోర్లా పడిపోయిన కెప్టెన్.. వైరల్ వీడియో!

వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. శ్రీలంకను ఓడించి ఈ మెగా టోర్నీలో మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచులో అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించిన ఆఫ్ఘనిస్తాన్.. చాలా కంఫర్టబుల్ విజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఛేజింగ్‌లో ఆఫ్ఘన్ జట్టు చాలా తెలివిగా ఆడింది . అనవసరమైన షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడిన ఆఫ్ఘన్ జట్టు మరో 28 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచులో శ్రీలంక వికెట్ కీపర్, కెప్టెన్ కుశాల్ మెండిస్ బొక్క బోర్లా పడిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు పగలబడి నవ్వుతున్నారు.

World Cup 2023 SLvsAFG captain stumbles and falls over wickets video goes viral

బంతిని కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించిన అతను.. ఆ ఊపును అదుపు చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే వికెట్ల మీదుగా పడిపోయాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచులో శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ దారుణంగా ఫెయిలయ్యాడు. ఎన్నో ఆశలు పెంచుకున్న ఫ్యాన్స్‌ను పక్కన పెట్టేసిన అతను ఎక్కువ పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచులో శ్రీలంక బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోలేదు. శ్రీలంక టీంలో అత్యధిక స్కోరు 46 మాత్రమే. ఈ క్రమంలోనే పరిస్థితి గురించి వారికి తెలిసిందే. దీంతో ఆ జట్టు కేవలం 241 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఛేజింగ్‌ను ఆఫ్ఘనిస్తాన్ సరిగా మొదలు పెట్టలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ గుర్బాజ్ (0) డకౌట్ అయ్యాడు.

అయితే మిగతా బ్యాటర్‌లు చక్కగగా రాణించారు. చివర్లో మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హష్మతుల్లా షాహిదీ.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇది ఈ వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు మూడో విజయం కావడం గమనార్హం. పాకిస్తాన్ వంటి దేశాలు ఈ టోర్నీలో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించగా.. ఆఫ్ఘన్ మూడో విజయంతో చెలరేగడం గమనార్హం.

Story first published: Tuesday, October 31, 2023, 9:51 [IST]
Other articles published on Oct 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+