World cup 2023 అసలే బాధలో ఉన్న శ్రీలంక.. ఇప్పుడు ఇంత షాక్ను ఎలా తట్టుకుంటుందో..!
వరల్డ్ కప్లో శ్రీలంక టైం అస్సలు బాగాలేనట్లుంది. మొదటి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో దారుణంగా ఓడిన బాధ నుంచి తేరుకోక ముందే రెండో మ్యాచ్లో పాక్ చేతుల్లోనూ చిత్తుగా ఓడింది. గెలవాల్సిన మ్యాచ్ను చేతురాలా పోగొట్టుకుంది. ఇలా వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న ఆ జట్టుకు ఇప్పుడు మరో ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ దాసున్ శనక వరల్డ్ కప్ టోర్నీ నుంచి వైదొలిగాడు.
వరల్డ్ కప్ టోర్నీలో చివరిగా పాకిస్తాన్తో తలపడిన శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లోనే దాసున్ శనక గాయపడ్డాడు. తొడకండరాల గాయంతో మ్యాచ్ సమయంలోనే అతడు మైదానం వదిలి వెళ్లిపోయాడు. ఇక మెడికల్ చెకప్ తర్వాత దాసున్ గాయం పెద్దదేనని, దాని నుంచి కోలుకోవాలంటే 3 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు.

ఈ విషయాన్ని శ్రీలంక జట్టు యాజమాన్యం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. దీంతో వరల్డ్ కప్ నుంచి దాసున్ శనక పూర్తిగా వైదొగినట్లు తెలియజేసింది. అతడి స్థానంలో చమిక కరుణరత్నేను జట్టులోకి తీసుకున్నట్లు, దానికి ఐసీసీ అనుమతి కూడా లభించినట్లు వెల్లడించింది.
కాగా.. ఈ మధ్య కాలంలో దాసున్ శనక అటు కెప్టెన్గానూ, ఇటు ప్లేయర్గానూ తీవ్రమైన ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నీలో కూడా దాసున శనక ఘోరంగా విఫలమయ్యాడు.
ఆడిన 5 మ్యాచ్లలో 14, 5, 24, 9, 0, 2 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే ఈ వరల్డ్ కప్లో కూడా ఆడిన రెండు మ్యాచ్లలో శనక 68, 12 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కెప్టెన్సీలో కూడా శనక వైఫల్యం కనిపిస్తోంది. జట్టును ఒత్తిడిలో నుంచి బయటకు తీసుకురావడం, సరైన సమయంలో అవసరమైన బౌలింగ్ మార్పులు చేయడంలోనూ శనక ఫెయిల్యూర్ కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే శ్రీలంక తమ నెక్ట్స్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా కూడా దాదాపు శ్రీలంక మాదిరిగానే ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఓడింది. అయితే శ్రీలంకతో పోల్చితే ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ పటిష్ఠంగా కనిపిస్తోంది. అలాగే పాయింట్స్ టేబుల్లో పైకి రావాలన్నా, టోర్నీలో నిలబడాలన్నా లక్నో వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్లో గెలవడం రెండు జట్లకూ ముఖ్యం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications