Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mohammed Siraj: ‘పాకిస్తాన్ బ్యాటర్‌ని అలా అవుట్ చేశా..’ సీక్రెట్ బయటపెట్టిన సిరాజ్..!

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత బౌలర్లు సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టారు. పాక్ ఇన్‌ఫామ్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ను అవుట్ చేసిన సిరాజ్.. ఇండియాకి బ్రేక్ త్రూ ఇచ్చాడు. అయితే షఫీక్‌ను తాను ఎలా అవుట్ చేసింది, దాని కోసం ఎలాంటి సీక్రెట్ ప్లాన్ వేసింది సిరాజ్ వివరించాడు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తన బౌలింగ్‌ గురించి వివరించిన సిరాజ్.. 'కొత్త బంతి చేతికి రాగానే ముందుగా స్వింగ్ అవుతుందో లేదో చూడాలి. అప్పుడే ఏ లైన్‌లో, ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో అర్థమవుతుంది.

World Cup 2023 Siraj revealed secret behind Abdullahs wicket

పెద్ద టోర్నీ కాబట్టి ఈ మధ్యలో బ్యాట్స్‌మెన్‌ కొన్ని బౌండరీలు కూడా బాదుతారు. కానీ ఒక్కసారి లైన్ అండ్ లెంగ్త్ అందుకోగలిగితే.. బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టొచ్చ'ని చెప్పుకొచ్చాడు.

ఇక అబ్దుల్లా షఫీక్‌ను ఎలా మాయ చేసింది వివరిస్తూ.. 'అబ్దుల్లా షఫీక్ వికెట్ ప్లాన్ ప్రకారం తీశాం. దీని గురించి రోహిత్ భాయ్‌తో ముందే మాట్లాడాను. ఆ తర్వాత షఫీక్‌కి ఓ బౌన్సర్ వేశాను. ఆ తర్వాత రోహిత్ భాయ్‌తో మళ్లీ మాట్లాడాను. ఇది చూసిన అబ్దుల్లా.. నేను మళ్లీ బౌన్సర్ వేస్తానని అనుకున్నాడు. దాంతో బ్యాక్‌ఫుట్‌కి వెళ్లాడన్నా'డు.

అయితే అతడికి షాకిస్తూ తాను బౌన్సర్ కాకుండా గుడ్ లెంగ్త్ డెలివరీ విసిరానని, బంతిని అంచనా వేయడంలో ఫెయిల్ అయిన అబ్దుల్లా.. వికెట్ల ముందు దొరికిపోవడంతో ఫస్ట్ బ్రేక్‌త్రూ దొరికిందని సిరాజ్ తన సీక్రెట్ ప్లాన్‌ను వివరించాడు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో సిరాజ్ 8 ఓవర్లలో 50 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. సిరాజ్ తీసిన వికెట్లలో ఓపెనర్ అబ్దుల్లాతో పాటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (50) కూడా ఉన్నాడు. బాబర్‌ను కూడా ఇలానే బుట్టలో వేసుకుని క్లీన్ బౌల్డ్‌ చేశాడు. సిరాజ్‌ను పక్కన పెడితే మిగిలిన భారత బౌలర్లలో బుమ్రా, జడేజా, హార్దిక్, కుల్దీప్‌లు కూడా తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

Story first published: Sunday, October 15, 2023, 17:00 [IST]
Other articles published on Oct 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+