For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shubman Gill: బాబర్‌కు రోజులు దగ్గర పడ్డాయి.. ఇక టైం లేదుగా..!

టీమిండియా ఓపెనర్ గిల్ దెబ్బకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు రోజులు దగ్గరపడ్డట్లే కనిపిస్తోంది. ఒకపక్క గిల్ సూపర్ ఫాంతో దుమ్ము రేపుతుంటే.. మరోపక్క బాబర్ ఫామ్ లేక తంటాలు పడుతున్నాడు. దీంతో అటు ఇటుగా ఈ వరల్డ్ కప్‌‌లోనే బాబర్ ‌టైం అయిపోయేలా ఉంది. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్, మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

వరల్డ్ కప్ ముందు డెంగ్యూతో బాధపడిన శుభ్‌మన్ గిల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే పాకిస్తాన్‌తో జరిగిన కీలకమైన మూడో మ్యాచ్‌లో గిల్ జట్టులోకొచ్చాడు. అక్కడి నుంచి 3 మ్యాచ్‌లు ఆడిన గిల్.. ఓ హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో వరల్డ్ కప్ ముందు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 816 పాయింట్లతో ఉన్న గిల్.. ప్రస్తుతం 823 పాయింట్లకు చేరుకున్నాడు.

 World Cup 2023 Shubman Gill is just a step away to dethrown Babar Azam

అయితే పాక్ కెప్టెన్‌ బాబర్ ఆజమ్ మాత్రం ఫామ్‌ కోల్పోయి నానా అవస్థలు పడుతున్నాడు. ఇప్పటికే వరకు ఈ వరల్డ్ కప్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన బాబర్ కేవలం 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. అది కూడా ఒకటి భారత్‌పై కాగా.. రెండోది పసికూన ఆఫ్ఘనిస్తాన్‌పై. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌పై 5, శ్రీలంకపై 10, ఆసీస్‌పై 18 పరుగులు మాత్రమే చేసి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో బాబర్ పాయింట్లు దారుణంగా పడిపోయాయి. వరల్డ్ కప్ ముందు 838 పాయింట్లతో ఉన్న బాబర్.. ప్రస్తుతం 829 పాయింట్లకు పడిపోయాడు.

ఫలితంగా బాబర్, గిల్ మధ్య పాయింట్ల తేడా కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య కేవలం 6 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఈ లెక్కన ఇద్దరి ఫామ్‌ను బట్టి చూస్తే మరో రెండు, మూడు మ్యాచ్‌ల్లోనే బాబర్‌ను వెనక్కి నెట్టి గిల్ నెంబర్ వన్ వన్డే బ్యాటర్‌ ర్యాంకును సొంతం చేసుకునేలా కనిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. బాబర్ నెంబర్ వన్ ర్యాంకు పోయినట్లేనని, గిల్ దెబ్బకు బాబర్‌కు రోజులు దగ్గరపడ్డాయంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

Story first published: Wednesday, October 25, 2023, 19:41 [IST]
Other articles published on Oct 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+