Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: సారా కౌగిలిలో గిల్.. వైరల్ ఫొటో వెనుక అసలు మిస్టరీ ఇదీ!

కొన్ని రోజుల క్రితమే స్టార్ హీరోయిన్ రష్మిక మంధనకు సంబంధించిన ఒక డీప్ ఫేస్ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఇది పెద్ద దుమారం రేపడంతో కోర్లు ముందుకొచ్చి వీడియోను సోషల్ మీడియ నుంచి తప్పించింది. ఇప్పుడు ఇదే టెక్నాలజీతో టీమిండియా స్టార్ శుభ్‌మ్ గిల్‌ను కొందరు టార్గెట్ చేశారు.

క్రికెట్ దేవుడు సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌తో గిల్ డేటింగ్‌లో ఉన్నాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఒక ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న గిల్ హ్యాపీగా కూర్చొని ఉండగా.. పక్కనేస సారా టెండూల్కర్ నిలబడి ఉంది.

World Cup 2023 Shubman Gill in Sara Tendulkars hug story behind the viral photo

గిల్ భుజాల చుట్టూ చేయి వేసిన ఆమె చాలా సంతోషం కనిపిస్తోంది. ఈ ఫొటో, వీడియో చూసిన వాళ్లందర కూడా గిల్, సారా డేటింగ రూమర్స్ నిజమేనని అనుకున్నారు. అయితే ఇదంతా కూడా డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఫొటో అని తేలింది. దీంతో ఈ నకిలీ ఫొటో నిర్మాతలను ఫ్యాన్స్ తెగ తిట్టిపోస్తున్నారు.

ఇక ఒరిజినల్ ఫొటో విషయానికి వస్తే.. సారాతో పాటు ఉన్నది ఆమె సోదరుడు అర్జున్ టెండూల్కర్ అని తెలుస్తోంది. వీళ్లిద్దరూ ఏదో ఫంక్షన్‌కు వెళ్లిన సందర్భంగా ఇలా ఫొటో దిగినట్లు తెలుస్తోంది. దీన్ని ఏఐ టెక్నాలజీతో ఇలా సారా, గిల్ ఫొటోగా మార్చేశారు.

కాగా, తాజాగా ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకుల్లో ఆకట్టుకున్న గిల్.. బాబర్ ఆజమ్ చేతుల్లో నుంచి నెంబర్ వన్ వన్డే బ్యాటర్ ర్యాంకును కూడా లాగేసుకున్నాడు. ప్రస్తతుం వన్డేల్లో బెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అతనితోపాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, November 9, 2023, 12:22 [IST]
Other articles published on Nov 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+