Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: బాబర్‌ను గద్దె దించిన గిల్.. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన కోహ్లీ, రోహిత్!

టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అనుకున్నది సాధించాడు. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను గద్దె దించాడు. చాలా కాలంగా వీళ్లిద్దరూ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం నుంచి మంచి ఫామ్‌ కనబరిచిన గిల్.. బాబర్‌ను త్వరలోనే అధిగమించేస్తాడని అంతా అనుకున్నారు.

కానీ మధ్యలో గిల్ కొంత తడబడ్డాడు. అయితే కీలక సమయంలో ఫామ్ అందుకొని ఆసియా కప్‌లో రాణించాడు. కానీ వరల్డ్ కప్ ప్రారంభం సమయంలో డెంగ్యూ బారిన పడి తొలి మూడు మ్యాచులకు దూరమయ్యాడు. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన గిల్ మళ్లీ నెమ్మదిగా తన ఫామ్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే అత్యంత వేగంగా వన్డేల్లో 2 వేల పరుగుల మైలురాయి అందుకున్న బ్యాటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.

World Cup 2023 Shubman Gill dethrones Babar Azam as the number one ODI batter

అదే సమయంలో బాబర్ ఆజమ్ పేలవ ఫామ్‌తో తడబడ్డాడు. దీంతో గిల్ ఐసీసీ రేటింగ్ పాయింట్లు పెరిగాయి. ప్రస్తుతం 830 పాయింట్లతో ఉన్న గిల్.. బాబర్ (824) పాయింట్లను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో టాప్ ర్యాంకు సాధించిన నాలుగో ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్, ధోనీ, కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు.

అదే సమయంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ర్యాంకు కూడా మెరుగైంది. కొన్ని రోజుల క్రితం డేవిడ్ వార్నర్‌తో ఐదో స్థానాన్ని పంచుకున్న అతను.. ఇప్పుడు నాలుగో ర్యాంకుకు దూసుకొచ్చాడు. సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డీ కాక్.. కోహ్లీ కన్నా ముందున్నాడు. అయితే వీళ్లిద్దరి మధ్య కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ మాత్రమే తేడా ఉండటం గమనార్హం.

అలాగే వరల్డ్ కప్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన శ్రేయాస్ అయ్యర్ కూడా బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ముందడుగు వేశాడు. అంతకుముందు 35వ స్థానంలో ఉన్న అతను ఇప్పుడు 18వ ర్యాంకుకు చేరుకున్నాడు. అలాగే అద్భుతమైన ఫామ్‌ కనబరుస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ర్యాంకు మెరుగు పరుచుకొని ఆరో ర్యాంకుకు దూసుకొచ్చాడు.

Story first published: Wednesday, November 8, 2023, 15:34 [IST]
Other articles published on Nov 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+