Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Babar Azam: బాబర్! నీకది చేతకాదు.. కెప్టెన్సీ వదిలేయ్.. మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

భారత్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో దారుణంగా ఓడిన పాకిస్తాన్ జట్టుపై మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా బాబర్ ను చేతకాని కెప్టెన్ అని, వెంటనే కెప్టెన్సీ వదిలేయాలని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కూడా చేరాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాలిక్.. "నేను ఎప్పుడో బాబర్ గురించి చెప్పాను. అతడు ఆటగాడిగా జట్టుకు అద్భుతమైన విజయాలు అందించగలడు. కానీ కెప్టెన్ గా అతడు పనికిరాడు. బాబర్ కి ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం ఏ మాత్రం చేతకాదన్నా"డు.

World Cup 2023 Shoaib malik suggested For Pak captain Babar to leave captaincy

బాబర్ ఏదో కెప్టెన్సీ చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్లు ఉంటాడని, అలా అయితే జట్టు ముందుకెళ్ళేది, అభివృద్ధి సాధించేదెలా..? అని ప్రశ్నించాడు. అయితే ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని బాబర్ చెప్పుకొచ్చాడు.

అంతకుముందు వసీం అక్రమ్, మిస్బా ఉల్ హక్ కూడా బాబర్ కెప్టెన్సీపై, పాక్ జట్టు ఆటతీరుపైన ఇలాంటి విమర్శలే చేశారు. కాగా భారత్ తో మ్యాచ్ లో ఓడినప్పటి నుంచే బాబర్ పై ఇంత వ్యతిరేకత వస్తోంది. గతేడాది టీ 20 ప్రపంచ కప్ లో భారత్ ను 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడించినప్పుడు బాబర్ కెప్టెన్సీని మాజీలంతా ఆకాశానికి ఎత్తేశారు.

World Cup 2023 Shoaib malik suggested For Pak captain Babar to leave captaincy

ఇదిలా ఉంటే నిజంగానే బ్యాటర్ గా బాబర్ అద్భుతమైన రికార్డులు సాధించాడు. మొత్తంగా వన్డేల్లో 72 ఇన్నింగ్స్ ఆడిన బాబర్.. 54.1 సగటుతో 3359 పరుగులు చేశాడు. అందులో 11 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలున్నాయి.

ఇక కెప్టెన్ అయిన తర్వాత కూడా బాబర్ బ్యాటింగ్ లో పదును తగ్గలేదు. కెప్టెన్సీ చేసిన 37 వన్డేల్లో 62.21 సగటుతో 2115 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 14 అర్థ సెంచరీలున్నాయి. ప్రస్తుతం వన్డేల్లో అతడే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ గా కూడా ఉన్నాడు.

Story first published: Tuesday, October 17, 2023, 16:49 [IST]
Other articles published on Oct 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+