Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Babar Azam: ‘ఆ టీంలపై ఆడలేకపోతే నెం.1 బ్యాటర్ ఎలా అవుతావ్?’.. బాబర్‌పై విరుచుకుపడ్డ అక్తర్

పాకిస్తాన్ కెప్టెన్‌ బాబర్ ఆజమ్‌పై ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డాడు. కీలక సమయాల్లో, పటిష్ఠమైన జట్లపై ఆడలేకపోతే ఇక నెంబర్ వన్ బ్యాటర్ ఎలా అవుతావంటూ తీవ్రంగా విమర్శించాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బాబర్ విఫలం కావడంతో అక్తర్‌ ఈ కామెంట్స్ చేశాడు.

బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 62 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బాబర్ (18) ‌‌మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే బాబర్ ఆటతీరును షోయబ్ అక్తర్ తప్పుబట్టాడు.

World Cup 2023 Shoaib Akthar criticises Babar Azam for not palying when it matters.

వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పెర్ఫార్మెన్స్‌పై తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడిన షోయబ్.. జట్టుకు అవసరమైనప్పుడు పరుగులు చేయలేకపోవడం ఏంటని బాబర్‌ను నిలదీశాడు. వరల్డ్ కప్ టోర్నీలో మొదటి నుంచి బాబర్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడన్నాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడాన్ని అక్తర్ తప్పుబట్టాడు. అలాగే చెత్త బౌలింగ్‌, ఫీల్డింగ్‌ సమస్యలు, బ్యాటింగ్ వైఫల్యాలు.. ఇలా అన్ని విభాగాల్లో పాక్ ఫెయిల్ అయిందని విమర్శించాడు.

'కనీసం పరువు నిలబెట్టుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోతున్న మ్యాచ్‌లో అయినా గెలిచేందుకు ప్రయత్నించాలని సూచించాడు. ఆఫ్ఘన్ జట్టు చిన్న జట్టేం కాదు. జట్టును తేలికగా తీసుకోవద్దు. రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, మహమ్మద్ నబీ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్ అటాక్ ఆ జట్టు సొంతం. చెన్నై లాంటి టర్నింగ్ పిచ్‌లపై వాళ్లని ఎదుర్కోవాలంటే పాకిస్తాన్ బ్యాటింగ్‌ చాలా మెరుగవ్వాల'ని హెచ్చరించాడు.

ఇక బాబర్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. 'వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాలంటే బాబర్ తన బ్యాటింగ్‌లో ఎంతో మెరుగవ్వాలి. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై 367 పరుగుల భారీ టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు ఎంతో బాధ్యతతో ఆడాలి. కానీ బాబర్ పరమ చెత్తగా చేసిన తప్పే మళ్లీ చేసి అవుటయ్యాడు. పెద్ద జట్లపై భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడం నిజంగా సిగ్గు చేటు..' అంటూ బాబర్‌పై అక్తర్ విమర్శల వర్షం కురిపించాడు.

Story first published: Sunday, October 22, 2023, 15:33 [IST]
Other articles published on Oct 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+